Luna-25 Moon Mission Crash : లూనా-25 క్రాష్ తర్వాత ఆసుపత్రిలో చేరిన రష్యా టాప్ సైంటిస్ట్
రష్యా దేశానికి చెందిన లూనా-25 మూన్ మిషన్ క్రాష్ తర్వాత టాప్ రష్యన్ సైంటిస్ట్ ఆసుపత్రిలో చేరారు. రష్యా ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు....

Russian Scientist Mikhail Marov
Russian Scientist Mikhail Marov : రష్యా దేశానికి చెందిన లూనా-25 మూన్ మిషన్ క్రాష్ తర్వాత టాప్ రష్యన్ సైంటిస్ట్ ఆసుపత్రిలో చేరారు. రష్యా ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. (Luna-25 Moon Mission Crash) లూనా-25 ప్రోబ్ ల్యాండింగ్‌కు ముందు విన్యాసాల సమయంలో చంద్రుని ఉపరితలంపై కూలిపోవడంతో రష్యా చంద్రుని ఆశలు అడియాశలయ్యాయి.
Prime Minister Narendra Modi : బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోదీ
వెంటనే ఈ మిషన్‌లో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తల్లో ఒకరైన మాస్కోలోని మిఖాయిల్ మారోవ్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. (Top Russian Scientist Hospitalised) మిషన్ విఫలమైన తర్వాత మిఖాయిల్ ఆరోగ్యం దెబ్బతింది. శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ సోవియట్ యూనియన్ కోసం మునుపటి అంతరిక్ష యాత్రల్లో పనిచేశారు.
PM Modi : రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి రాఖీ కట్టనున్న పాక్ సోదరి
‘‘పరికరాన్ని ల్యాండింగ్ చేయడం సాధ్యం కాకపోవడం బాధాకరం. నాకు మా చంద్రుని కార్యక్రమం యొక్క పునరుద్ధరణను చూడాలనేది చివరి ఆశ’’ అని మారోవ్ అన్నారు. క్రాష్ వెనుక ఉన్న కారణాలను చర్చించి, పరిశీలించాలని తాను ఆశిస్తున్నట్లు మారోవ్ పేర్కొన్నారు.