జపాన్ లో భారీ భూకంపం
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 5.8 గా భూకంప తీవ్రత నమోదైంది.

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 5.8 గా భూకంప తీవ్రత నమోదైంది.
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 గా భూకంప తీవ్రత నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.56 గంటల ప్రాంతంలో ఉత్తర జపాన్ రీజియన్ లోని ఇజూ ద్వీపంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జపాన్ భూకంప హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ద్వీపానికి 33 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది.
ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో అక్కడి జనం భయంతో గజగజ వణికిపోయారు. భూప్రకంపనాల ధాటికి ఇళ్లని ఊగిపోయాయి. ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా వరకు చెట్లు నేలకూలాయి. పలుచోట్ల భూమి బీటలు వారింది.
ఇప్పటికే జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అక్కడి ప్రజలను అలర్ట్ పై హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. భూకంపం ధాటికి ఎంత ప్రాణనష్టం జరిగిందో తెలియనప్పటికీ.. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
2018 ఏడాది అక్టోబర్ లో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. అక్టోబర్ 26న తొలి భూకంపం రాగా.. రిక్టర్ స్కేలుపై 5.6 గా నమోదైంది. రెండో భూకంపం అక్టోబర్ 23న జపాన్ హొక్కాడియో ద్వీప ప్రాంతంలో 6.1 గా రిక్టర్ స్కేలుపై నమోదైంది.
Read Also : గేల్ తో సెల్ఫీ దిగిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?