Trump Tariffs Effect: ఇండియాపై ట్రంప్ దెబ్బ.. 25 శాతం టారిఫ్ ఎఫెక్ట్.. ఏమేం రేట్లు పెరుగుతాయి?
దెబ్బకు దెబ్బ టైప్ లో భారత్ కూడా అమెరికా మీద కౌంటర్ టారిఫ్ లు విధిస్తే ఏమవుతుందనే సందేహం కూడా వస్తుంది.

Trump Tariffs Effect: అమెరికా అధ్యక్షుడు బాంబు పేల్చారు. ఇండియాపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. రష్యా నుంచి ఆయిల్, ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నందుకు మరింత పెనాల్టీ కూడా విధిస్తున్నట్టు చెప్పారు. ట్రంప్ టారిఫ్ విధించిన తర్వాత ఏం జరుగుతుంది? ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి? ఇండియా మీద ప్రభావం ఎంత ఉంటుంది? అమెరికా మీద ప్రభావం ఎంత ఉంటుందో చూద్దాం.
భారత్ పై టారిఫ్ ఎఫెక్ట్ ఎంత?
భారత్ నుంచి దిగుమతి అయ్యే వాటిపై 25 శాతం టారిఫ్ విధిస్తుంది అమెరికా. అంటే ఇండియాకి నష్టం ఏముంది? అమెరికాకే కదా నష్టం అనుకుంటాం. కానీ అలా కాదు. ఇండియా నుంచి ఎగుమతి అయ్యే ఎలక్ట్రానిక్స్, ఐటీ సర్వీసెస్ లాంటివి అమెరికాలో కాస్ట్ లీ అవుతాయి. అప్పుడు భారత్ కి బిజినెస్ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇది విదేశీ మారక నిల్వల మీద ప్రభావం చూపిస్తుంది.
మరోవైపు అమెరికా మొత్తం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. జెమ్స్, జ్యూయలరీ, మొబైల్, ఆటో పార్ట్స్, ఐటీ సర్వీసుల ఎగుమతులపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. భారత స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే నెగిటివ్ గా స్పందిస్తున్న మార్కెట్లు మరింత ఫాల్ కావొచ్చు. రూపాయి విలువ మరింత పతనం కావొచ్చు. ఇప్పటికే డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.87.5గా ఉంది. ఫారెన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్ మెంట్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా రంగాన్ని మినహాయించడం కొంత ఊరట కలిగించే అంశం. చైనా (54శాతం), వియత్నాం (46 శాతం) తో పోలిస్తే ఇండియా 25శాతం కొంత ఊరట కలిగించే అంశం.
ఇండియా ఏం చేయొచ్చు?
దెబ్బకు దెబ్బ టైప్ లో భారత్ కూడా అమెరికా మీద కౌంటర్ టారిఫ్ లు విధిస్తే ఏమవుతుందనే సందేహం కూడా వస్తుంది. కానీ, దాని వల్ల ట్రేడ్ టెన్షన్స్ పెరుగుతాయి. ఇండియా పెంచుతుందని తెలిసిన వెంటనే మళ్లీ ట్రంప్ ఇంకా టారిఫ్ లు పెంచినా పెంచొచ్చు. భారత్ నుంచి అమెరికాకి ఏమేం ఎగుమతి అవుతున్నాయో చూసుకుని.. ఆయా రంగాలకు ప్రభుత్వం సహకారం అందిస్తే కొంచెం బెటర్. ఆయా కంపెనీలకు సబ్సిడీలు అందిస్తే కంపెనీలు తట్టుకుంటాయి. అదే టైమ్ లో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులను తగ్గించి భారత్ సొంతంగా ఆత్మనిర్భరత వైపు నడవాలి.
అమెరికా మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది?
అమెరికా ప్రజల మీదే మొదటి ఇంపాక్ట్ పడుతుంది. ఇపోర్ట్ చేసుకునే వారి మీద ట్యాక్స్ విధిస్తే వాళ్లు ఆ ప్రొడక్ట్ రేటు పెంచుతారు. దీంతో జనం జేబులకు చిల్లు పడుతుంది. అంటే అమెరికాలో ఎలక్ట్రానిక్స్, ఆటో పార్ట్స్, టెక్స్ టైల్స్ రేట్లు పెరుగుతాయి.
Also Read: ఇండియాకు ట్రంప్ షాక్.. భారత్ పై 25 శాతం సుంకాలు.. పైగా పెనాల్టీ