China border: చైనా సరిహద్దు సమీపంలో ఇద్దరు అరుణాచల్ యువకులు అదృశ్యం.. 56 రోజులుగా దొరకని ఆచూకీ
అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో అదృశ్యమయ్యారు. గత 56 రోజులుగా వారి ఆచూకీ తెలియడం లేదు. వన మూలికలు సేకరించడం కోసం వారు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి, వాస్తవ నియంత్రణ రేఖ దాటినట్లు తెలుస్తోంది. ఆ యువకుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ యువకుల పేర్లు బటేలం టిక్రొ, బెయింగ్సో మన్యు అని, ఈ నెల 9వ తేదీన వారి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

China border: అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో అదృశ్యమయ్యారు. గత 56 రోజులుగా వారి ఆచూకీ తెలియడం లేదు. వన మూలికలు సేకరించడం కోసం వారు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి, వాస్తవ నియంత్రణ రేఖ దాటినట్లు తెలుస్తోంది. ఆ యువకుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ యువకుల పేర్లు బటేలం టిక్రొ, బెయింగ్సో మన్యు అని, ఈ నెల 9వ తేదీన వారి తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.
అనంతరం దీనిపై అధికారులు భారత సైన్యంతో మాట్లాడారు. ఆ యువకుల జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆగస్టు 19న చగ్లగం ప్రాంతానికి వారిద్దరు వెళ్లారని వారి తల్లిదండ్రులు చెప్పారు. వారు తిరిగి రాకపోవడంతో వారి కోసం వెతికాతమని, అయినా వారి ఆచూకీ కనపడలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ యువకులు చైనా భూభాగంలోకి ప్రవేశించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. వారిని చైనా సైనికులు నిర్బంధించి ఉండొచ్చని అంటున్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..