UK PM Boris Johnson : బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌‌కు జరిమానా.. దేశ ప్రజలకు క్షమాపణలు..!

UK PM Boris Johnson : బ్రిటన్ ప్రజలకు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ క్షమాపణలు చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయన ప్రజలను క్షమాపణలు కోరారు.

UK PM Boris Johnson : బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌‌కు జరిమానా.. దేశ ప్రజలకు క్షమాపణలు..!

Uk Pm Boris Johnson Offers Full Apology After Partygate Fine

Updated On : April 13, 2022 / 9:56 PM IST

UK PM Boris Johnson : బ్రిటన్ ప్రజలకు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ క్షమాపణలు చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయన ప్రజలను క్షమాపణలు కోరారు. 2020లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఆయన బర్త్‌డే పార్టీ జరుపుకున్నారు. ఆ సమయంలో జాన్సన్‌కు మెట్రోపాలిటన్ పోలీసులు జరిమానా విధించారు. ప్రజలకు సూచించాల్సిన తానే కరోనా లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించి పెద్ద తప్పు చేశానంటూ, అందుకు తనను క్షమించాలని బోరిస్‌ జాన్సన్ ప్రజలను కోరారు.

కోవిడ్ రూల్స్ నిబంధ‌న‌లు అమ‌లులో ఉండగా.. అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న నేతగా జాన్సన్ ఎలా హాజ‌రువుతార‌ంటూ ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి. ఈ క్రమంలో పార్ల‌మెంట్ వేదిక‌గా జాన్సన్ జాతి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు తెలియజేశారు. కరోనా స‌మ‌యంలో ప్ర‌భుత్వం ప‌క్షాన బర్త్ డే పార్టీ ఇవ్వ‌డం ఎంతమాత్రం స‌రైన విధానం కాద‌ని, అందుకే తాను మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని జాన్స‌న్ తెలిపారు.

అంతేకాదు.. సొంత పార్టీలోని నేతలు కూడా ఆయన్ను రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. డౌనింగ్ స్ట్రీట్‌లో జ‌రిగిన బర్త్ డే పార్టీలో తాను పాల్గొన్న‌ట్లు ప్ర‌ధాని జాన్స‌న్ మొద‌టిసారిగా అంగీక‌రించారు. అయితే తాను కోవిడ్ రూల్స్ ఉల్లంఘించ‌లేద‌ని వాదించారు. ప్రతిపక్షాల నుంచి, పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో చివ‌రికి జాతికి జాన్సన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

Read Also : Boris Johnson : కీవ్ వీధుల్లో బ్రిటన్ ప్రధాని ప్రత్యక్షం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి..