Russia Ukraine War: చర్చలకు సిద్ధమైన జెలెన్‌స్కీ.. బెలారస్‌లో సిద్ధంగా రష్యన్ బృందం..!

యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. మెట్టు దిగారు. యుద్ధ నివారణ దిశగా ఆయన అత్యంత కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రష్యాతో బెలారస్ లో చర్చలకు ఆయన అంగీకారం తెలిపారు.

Russia Ukraine War: చర్చలకు సిద్ధమైన జెలెన్‌స్కీ.. బెలారస్‌లో సిద్ధంగా రష్యన్ బృందం..!

Jelensky

Updated On : February 27, 2022 / 7:12 PM IST

Russia Ukraine War: రష్యా – యుక్రెయిన్ యుద్ధంలో.. ఇదో కీలక పరిణామం. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సందర్భం. ముఖ్యంగా.. యుక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్న పరిణామం. అందుకు తగినట్టే.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. మెట్టు దిగారు. యుద్ధ నివారణ దిశగా ఆయన అత్యంత కీలక నిర్ణయాన్ని కాపేపటి క్రితం తీసుకున్నారు. తన దేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు.. తిరిగి శాంతియుత వాతావరణాన్ని స్థాపించేందుకు.. ఆయన రష్యాతో చర్చలకు సిద్దమైనట్టు సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు.. బెలారస్ లో రష్యాతో చర్చలకు సిద్ధమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఇప్పటికే.. రష్యా బృందం.. బెలారస్ చేరుకోగా.. ఇప్పుడు యుక్రెయిన్ బృందం కూడా.. బెలారస్ బాట పట్టినట్టు ఆ దేశం నుంచి వార్తలందుతున్నాయి.

Russia Ukraine War : రష్యాతో చర్చలకు సిద్ధమే, కానీ అక్కడ కాదు – జెలెన్ స్కీ ట్విస్ట్

అయితే.. బెలారస్ వేదికగా చర్చలకు ముందుగా జెలెన్ స్కీ అంగీకారం తెలపలేదు. వేరే ఏ ప్రాంతంలో అయినా చర్చలు చేద్దామని పట్టుబట్టారు. కానీ.. రష్యా పట్టు వీడకపోవడం.. రోజు రోజుకూ పరిస్థితి చేయి దాటుతుండడం.. ఎంతగా పోరాడుతున్నా యుక్రెయిన్ ఆర్మీ బలహీన పడుతుండడం.. అంతిమంగా యుక్రెయిన్ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితుల్లో.. యుక్రెయిన్ అధ్యక్షుడు తప్పని అత్యవసర పరిస్థితుల్లో మెట్టు దిగినట్టు కనిపిస్తోంది.

Russia Ukraine War : యుక్రెయిన్‌కు రూ.65 కోట్లు.. జపాన్ కుబేరుడి భారీ విరాళం

నాలుగు రోజులుగా యుక్రెయిన్ పై.. రష్యా విరుచుకుపడుతోంది. ఈ తరుణంలో.. యుక్రెయిన్ సైనికులు, పౌరులు అంతా కలిసి మరీ రష్యన్ ఆర్మీని ఎదిరిస్తున్నారు. వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో.. అక్కడి ప్రజలకే కాక.. విదేశాల నుంచి యుక్రెయిన్ వచ్చిన వారికీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రష్యా ఆర్మీ ధాటిని తట్టుకోలేక.. పసి పిల్లల నుంచి.. ముసలివాళ్ల వరకూ ప్రాణభయంతో వణికిపోయే దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కీలక తరుణంలో.. ప్రజల వెంటే ఉన్న జెలెన్ స్కీ.. ఓ దశలో సైనికుడిగా మారి యుద్ధ క్షేత్రంలో దూకారు. తన ఆర్మీని ముందుండి నడిపించారు. పరిస్థితి చక్కదిద్దేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేశారు. ఇంతగా.. తన దేశ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటంపై.. యుక్రెయిన్ అనుకూల దేశాల నుంచి ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు.. అదే ప్రజల కోసం.. ఆయన రష్యాతో చర్చలకు సిద్ధమవడం పైనా.. అదే రీతిలో సానుకూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

Russia Ukraine War: యుక్రెయిన్‎కు 25 దేశాల మద్దతు..!

కాసేపట్లో చర్చలు మొదలు కానున్న తరుణంలో.. రష్యా – యుక్రెయిన్ ప్రభుత్వాలు.. ఉద్రిక్తతల నివారణల దిశగా మెట్టు దిగుతాయా..? రష్యా డిమాండ్లకు యుక్రెయిన్ తలొగ్గుతుందా..? యుక్రెయిన్ వాదనను రష్యా అంగీకరిస్తుందా.. లేదా యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితులే ఎదురవుతాయా..? అన్న ప్రశ్నలకు.. యావత్ ప్రపంచం సమాధానం కోసం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా.. రష్యా దాడులతో 4 రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్న యుక్రెయిన్ ప్రజలు.. ఈ చర్చలతో ఏం తేలనుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మునుపటి శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటున్నారు.

Russia Ukraine War: సామాన్యులే.. వీర సైనికులై..!