US Venezuela Conflict: అమెరికా-వెనెజులా వివాదం.. భారత్‌కు రావాల్సిన ఆ కోట్లాది రూపాయలు ఇక వచ్చేస్తాయా?

భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్, వెనిజులా తూర్పు ప్రాంతంలోని శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రాన్ని స్థానిక ప్రభుత్వ రంగ ఉత్పత్తి సంస్థతో భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. US Venezuela Conflict

US Venezuela Conflict: అమెరికా-వెనెజులా వివాదం.. భారత్‌కు రావాల్సిన ఆ కోట్లాది రూపాయలు ఇక వచ్చేస్తాయా?

Venezuela Oil Sector Representative Image (Image Credit To Original Source)

Updated On : January 4, 2026 / 6:22 PM IST
  • అమెరికా మద్దతుతో వెనిజులా చమురు పరిశ్రమ పునర్నిర్మాణం
  • భారత్ కు కలగనున్న ప్రయోజనం
  • దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు తిరిగి పొందడం
  • ముడి చమురు ఉత్పత్తి తిరిగి ప్రారంభం

 

US Venezuela Conflict: అమెరికా మద్దతుతో వెనిజులా చమురు పరిశ్రమ పునర్నిర్మాణం భారత దేశానికి ప్రయోజనం చేకూర్చనుందని తెలుస్తోంది. చమురు పరిశ్రమ పునర్నిర్మాణం భారత్ కు ఆర్థికపరమైన, వ్యూహాత్మక లాభాన్ని అందించగలదని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు (దాదాపు 1 బిలియన్ డాలర్లు) తిరిగి రావడం, భారతీయ కంపెనీలు పాల్గొన్న క్షేత్రాల నుండి ముడి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడం వంటివి ఉన్నాయి. 1 బిలియన్ డాలర్ల బకాయిలను తిరిగి పొందడంతో పాటు ONGC విదేశ్ లిమిటెడ్ శాన్ క్రిస్టోబల్ క్షేత్రాన్ని పునరుద్ధరించడానికి ఇది దోహదపడుతుందని వివరించారు.

ఒకప్పుడు వెనిజులా హెవీ క్రూడ్‌ ప్రధాన ప్రాసెసర్‌గా భారత్ ఉండేది. గరిష్ట స్థాయిలో రోజుకు 4,00,000 బ్యారెళ్లకు పైగా దిగుమతి చేసుకునేది. 2020లో అమెరికా ఆంక్షలు విధించింది. నిబంధనలను కఠినతరం చేసింది. వాణిజ్యపరంగా లాభదాయకం కాకుండా చేయడంతో సరఫరాలు ఆగిపోయాయి.

ఆంక్షల కారణంగా నిలిచిన భారతీయ పెట్టుబడులు..

భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఓఎన్‌జిసి విదేశ్ లిమిటెడ్, వెనిజులా తూర్పు ప్రాంతంలోని శాన్ క్రిస్టోబల్ చమురు క్షేత్రాన్ని స్థానిక ప్రభుత్వ రంగ ఉత్పత్తి సంస్థతో భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. ఆంక్షల కారణంగా డ్రిల్లింగ్ రిగ్‌లు, సాంకేతికత, చమురు క్షేత్ర సేవల లభ్యతకు ఆటంకాలు ఏర్పడటంతో, ఉత్పత్తి రోజుకు 5,000–10,000 బ్యారెళ్లకు పడిపోయింది. 2014 వరకు OVL 40 శాతం వాటాపై చెల్లించాల్సిన 536 మిలియన్ డాలర్ల డివిడెండ్లను వెనిజులా చెల్లించలేదు.

ఉత్పత్తి పునరుద్ధరణ సాధ్యమే..

కారకాస్‌లో ఇటీవలి రాజకీయ పరిణామాల తర్వాత ఆంక్షలను సడలిస్తే, ఉత్పత్తిని పునరుద్ధరించడానికి భారతీయ ఆపరేటర్లు గుజరాత్‌లోని ONGC ఆస్తులు సహా దేశీయ క్షేత్రాల నుండి రిగ్‌లు పరికరాలను తరలించొచ్చు. తగినంత పెట్టుబడి, డ్రిల్లింగ్ కార్యకలాపాలతో, శాన్ క్రిస్టోబల్ మాత్రమే 80,000–1,00,000 bpd ఉత్పత్తి చేయగలదని అధికారులు తెలిపారు.

కారాబోబో-1 హెవీ ఆయిల్ బ్లాక్‌లో భారతీయ సంస్థలు కూడా వాటాలను కలిగి ఉన్నాయి. OVL 11 శాతం వాటాను కలిగి ఉండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వెనిజులా జాతీయ చమురు సంస్థ PDVSA మెజారిటీ భాగస్వామిగా ఉంది. కానీ పునర్నిర్మాణానికి లోనయ్యే అవకాశం ఉంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, IOC, HPCL-మిట్టల్ ఎనర్జీ, మంగళూరు రిఫైనరీ వంటి భారతీయ శుద్ధి కర్మాగారాలు వెనిజులా భారీ ముడి చమురును సమర్థవంతంగా ప్రాసెస్ చేయగల సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఉత్పత్తి పెరిగి చెల్లింపు విధానాలు సాధారణ పరిస్థితికి వస్తే వాణిజ్య ప్రవాహాలు త్వరగా తిరిగి ప్రారంభమవుతాయని విశ్లేషకులు నివేదించారు, ఇది భారత్ కు ఆర్థిక పునరుద్ధరణతో దీర్ఘకాలిక సరఫరా భద్రతను తీసుకొస్తుంది.

Also Read: బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు… ఎవరీ నికోలస్ మదురో, దేశాధ్యక్షుడు ఎలా అయ్యారు, సంపద ఎంత