అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్ దే…న్యాయపోరాటానికి సిద్దమైన ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 06:57 AM IST
అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్ దే…న్యాయపోరాటానికి సిద్దమైన ట్రంప్

Joe Biden at 264 electoral votes అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్​ దూసుకెళ్తున్నారు. హోరాహోరీగా సాగుతోన్న అధ్యక్ష ఎన్నికల్లో శ్వేతసౌధానికి ఆరు ఎలక్టోరల్​ ఓట్ల దూరంలో బైడెన్​ ఉన్నారు. అధ్యక్ష పీఠం సాధించేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్​ ఓట్లకు గాను బైడెన్​ 264 ఓట్లు సాధించారు. కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా,మిచిగావ్,విస్కాన్సిస్,న్యూయార్క్ వంటి రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకొని…అధ్యక్ష పదవికి చేపట్టేందుకు బైడెన్ సిద్దమయ్యారు.



ఇక,రిపబ్లిక్ పార్టీ నుంచి రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేైసిన డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్​ ఓట్లు సాధించారు. మరోవైపు ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్​ న్యాయపోరాటానికి దిగారు. బైడెన్ గెలుపొందిన విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఓట్లను పునర్​లెక్కించాలని ట్రంప్​ బృందం కోరనుంది. ఇక్కడ ఇరువురి మధ్య పోరు హోరాహోరిగా సాగింది. 2016లో కూడా ఈ రాష్ట్రంలో ట్రంప్​ ఒక పాయింట్​ కన్నా తక్కువ మార్జిన్​లో ఓడిపోయారు.



https://10tv.in/keep-the-faith-guys-we-are-going-to-win-this-joe-biden/
కాగా, అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్​ వేళ శ్వేతసౌధం బయట నిరసనలు జరుగుతున్నాయి. ట్రంప్​, బైడెన్​ మద్దతుదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ‘బ్లాక్​ లైవ్స్​ మేటర్’​ నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు