US Flying Surveillance Drones : గాజాలో బందీల ఆచూకీ కోసం అమెరికా నిఘా డ్రోన్లు

గాజా నగరంలో బందీల ఆచూకీ కోసం అమెరికా దేశానికి చెందిన ఎగిరే నిఘా డ్రోన్లు యత్నిస్తున్నాయి. హమాస్ 200 మందిని బందీలుగా పట్టుకోగా వారిలో పదిమంది అమెరికన్లు ఉన్నారని అమెరికా అధికారులు చెప్పారు. అమెరికా బందీలను విడిపించేందుకు గాజాపై యూఎస్ నిఘా సేకరణ డ్రోన్లు ఎగురవేస్తురన్నట్లు ఓ అధికారి చెప్పారు....

US Flying Surveillance Drones : గాజాలో బందీల ఆచూకీ కోసం అమెరికా నిఘా డ్రోన్లు

US Flying Surveillance Drones

Updated On : November 3, 2023 / 9:18 AM IST

US Flying Surveillance Drones : గాజా నగరంలో బందీల ఆచూకీ కోసం అమెరికా దేశానికి చెందిన ఎగిరే నిఘా డ్రోన్లు యత్నిస్తున్నాయి. హమాస్ 200 మందిని బందీలుగా పట్టుకోగా వారిలో పదిమంది అమెరికన్లు ఉన్నారని అమెరికా అధికారులు చెప్పారు. అమెరికా బందీలను విడిపించేందుకు గాజాపై యూఎస్ నిఘా సేకరణ డ్రోన్లు ఎగురవేస్తురన్నట్లు ఓ అధికారి చెప్పారు. హమాస్ సొరంగాల్లో బందీలను దాచి ఉంచవచ్చనే అనుమానంతో యూఎస్ డ్రోన్లు వారి కోసం గాలిస్తున్నాయి.

Also Read : Selling Snake : మధురలో పాములు, పాము విషం విక్రయం కేసులో ముగ్గురి అరెస్ట్

ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయి. గాజాలోని భూగర్భ సొరంగాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేస్తోంది. గాజాకు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పౌరులు దక్షిణ గాజాకు పారిపోవాలని ఇజ్రాయెల్ సూచించింది. హమాస్ యోధులు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ దేశంలో 1400మంది మరణించారు. పాలస్తీనా ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార బాంబు దాడిలో 9,061 మందిని చంపింది.

Also Read : Trinamool MP Mahua Moitra : లోక్‌సభ స్పీకరుకు ఎంపీ మహువా మొయిత్రా సంచలన లేఖ

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై 28 రోజులు గడిచింది. దాడి తర్వాత హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడి ముగింపునకు చేరుకోవడం లేదు. ఇంతలో హమాస్, హిజ్బుల్లా గత రాత్రి సెంట్రల్ ఇజ్రాయెల్‌పై భారీ దాడిని కూడా ప్రారంభించాయి. ఈ దాడిలో ఓ వైపు పలు ఇళ్లు దహనమయ్యాయి. మరోవైపు పలు వాహనాలు దహనం అయ్యాయి. హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం రెండోసారి ఇజ్రాయెల్ చేరుకోనున్నారు.

Also Read : Cobra : సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్…ఎందుకంటే బుసలుకొట్టే నాగుపాము చూసి…

ఇజ్రాయెల్- హమాస్ ఉగ్రవాదుల మధ్య నాలుగు వారాల యుద్ధంలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 9వేలకు పైగా పెరిగింది. ఇజ్రాయెల్ దళాలు గురువారం హమాస్ ఉగ్రవాదులపై దాడిలో గాజా నగరాన్ని చుట్టుముట్టాయి. అయితే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ భూగర్భ సొరంగాల నుంచి హిట్ అండ్ రన్ దాడులతో ఇజ్రాయెల్ డ్రైవ్‌ను ప్రతిఘటించింది. ఇజ్రాయెల్ విమానాలు గాజా సిటీ కేంద్రానికి సరిహద్దుగా ఉన్న షాతీ శరణార్థి శిబిరాన్ని తక్షణమే ఖాళీ చేయాలని నివాసితులను హెచ్చరిస్తూ కరపత్రాలను జారవిడిచాయి.

Also Read : Skill Development Scam : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ లపై ఫిర్యాదు

లక్షలాది మంది పాలస్తీనియన్లు ఖాళీ చేయమని ఇజ్రాయెల్ పదేపదే పిలుపునిచ్చినప్పటికీ, ఉత్తర గాజాలో పోరాట మార్గంలోనే ఉన్నారు. గాజాలోని బురీజ్ శరణార్థుల శిబిరంపై గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 15 మంది మరణించారు. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ స్థానాలపై పలుసార్లు దాడులు చేసింది.