Selling Snake : మధురలో పాములు, పాము విషం విక్రయం కేసులో ముగ్గురి అరెస్ట్

అత్యంత విషపూరితమైన పాములు, పాముల విషాన్ని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది....

Selling Snake : మధురలో పాములు, పాము విషం విక్రయం కేసులో ముగ్గురి అరెస్ట్

Selling Snake

Updated On : November 3, 2023 / 6:33 AM IST

Selling Snake : అత్యంత విషపూరితమైన పాములు, పాముల విషాన్ని విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. యూపీరాష్ట్రంలోని మధుర నగరానికి చెందిన పాము స్మగ్లర్లు సత్పాల్, శ్యామ్ నాథ్, పప్పు నాథ్‌ పాములను పట్టుకొని వాటితోపాటు వాటి విషాన్ని విక్రయిస్తుంటారు. పది గ్రాముల పాము విషాన్ని లక్షన్నర రూపాయలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Also Read : Trinamool MP Mahua Moitra : లోక్‌సభ స్పీకరుకు ఎంపీ మహువా మొయిత్రా సంచలన లేఖ

ఘజియాబాద్‌లోని మధ్యవర్తికి విక్రయించేందుకు పాములను పట్టుకున్నామని, తాము పాముల విషాన్ని వెలికితీసి మెట్రో నగరాల్లో జరిగే రేవ్ పార్టీల్లో మత్తు పదార్థాలకు కలిపేందుకు అధిక ధరలకు విక్రయిస్తామని నిందితులు వెల్లడించారు. ముగ్గురు నిందితుల నుంచి నాలుగు కొండచిలువలు, మూడు నాగుపాములను మధుర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాముల స్మగ్లర్లు బెల్టులు, బ్యాగులు, బూట్లలో ఉపయోగించే చర్మం కోసం నాగుపాములు, కొండచిలువలను అడవులు, జాతీయ ఉద్యానవనాల నుంచి పట్టుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : Cobra : సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్…ఎందుకంటే బుసలుకొట్టే నాగుపాము చూసి…

పాముల స్మగ్లర్లను పట్టుకునేందుకు పీపుల్ ఫర్ యానిమల్స్ సభ్యులు సహాయం చేశారు. ఈ స్మగ్లర్లు అవినీతి అటవీ శాఖ, నేషనల్ పార్క్ ఉద్యోగులతో కుమ్మక్కయ్యారని పాము విషం, చర్మాన్ని విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని పీపుల్ ఫర్ యానిమల్స్ సభ్యులు పేర్కొన్నారు.

Also Read : Kasani Gnaneshwar : బీఆర్ఎస్ లో చేరనున్న కాసాని.. గోశామహల్ నుంచి పోటీ?

మధుర పోలీసులు పాము స్మగ్లర్లు సత్పాల్, శ్యామ్ నాథ్, పప్పు నాథ్‌లను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. వీరంతా మథుర జిల్లాలోని షెర్‌ఘర్ గ్రామ నివాసితులు. ఘజియాబాద్‌కు చెందిన ప్రధాన సూత్రధారి నిఖిల్ సిసోడియా సహా ఇతర సహచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.