Donald Trump : డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌లో యువ నాయకత్వానికి పెద్దపీట.. బైడెన్, ట్రంప్ టీమ్‌కు తేడాలు ఇవే..
డొనాల్డ్ ట్రంప్ తన 2.0 అడ్మినిస్ట్రేషన్ టీమ్ లో ఎక్కువగా యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తున్నారు.

Tulsi Gabbard, Pete Hegseth, and Elise Stefanik
Donald Trump Team : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయడంకా మోగించిన ట్రంప్.. ఇక ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో ఫుల్ బిజీ అయ్యారు. ఒక్కొక్కరుగా సమర్థులను అడ్మినిస్ట్రేషన్ టీమ్ లో నియమిస్తూ అమెరికాను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ తో సంచలన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ టీమ్ ను బట్టి అర్థమవుతోంది. అయితే, ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్ టీమ్ లో యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తున్నారు.
78ఏళ్ల వయస్సులో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్ట బోతున్నారు. జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన అడ్మినిస్ట్రేషన్ టీమ్ లో ఎక్కువగా యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ట్రంప్ 2.0 టీమ్ లో ఇప్పటి వరకు నియమించిన వారిలో 40 – 45 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)కి నాయకత్వం వహించడానికి ఎలోన్ మస్క్ (53)తో పాటు ట్రంప్ ఎంపిక చేసిన వివేక్ రామస్వామి వయస్సు 39 మాత్రమే.
Also Reada: ట్రంప్ టీమ్ రెడీ..! ప్రో ఇండియన్స్‌కి కీలక పదవులు..
40 సంవత్సరాల వయస్సులో ఒహియో నుంచి తొలిసారి సెనేటర్ అయిన జేడీ వాన్స్ యూఎస్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన వైస్ ప్రెసిడెంట్ లలో ఒకరు. అమెరికా సైన్యంలో పనిచేసిన తులసీ గబ్బార్డ్ తదుపరి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ట్రంప్ ఎంపిక చేశారు. ఆమె వయస్సు కేవలం 43ఏళ్లు మాత్రమే. జో బైడెన్ టీమ్ లో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా పనిచేసిన అవ్రిల్ హైన్స్ కంటే తులసి గబ్బార్డ్ 12ఏళ్లు చిన్నది. అదేవిధంగా పీట్ హెగ్‌సేత్ (రక్షణ కార్యదర్శి), లీ జెల్డిన్ (ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అడ్మినిస్ట్రేటర్), ఎలిస్ స్టెఫానిక్ (యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్), మాట్ గేట్జ్ (అటార్నీ జనరల్ మరియు జస్టిస్ డిపార్ట్‌మెంట్ హెడ్) వయస్సు 40-45 మధ్య ఉన్నాయి.
Also Read: Donald Trump: దూకుడు పెంచిన ట్రంప్.. కీలక పదవుల్లో వరుసగా నియామకాలు.. పూర్తి జాబితా ఇదే..
జో బైడెన్, ట్రంప్ 2.0 కేబినెట్ లోని వారి వివరాలు, వయస్సు ..
వైస్ ప్రెసిడెంట్ :
జో బైడెన్ క్యాబినెట్ లో కమలా హారిస్ ఉన్నారు. ఆమెకు 60ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో జేడీ వాన్స్ నియామకం అయ్యారు. అతని వయస్సు 40ఏళ్లు.
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాప్ :
జో బైడెన్ కేబినెట్ లో జెఫ్ జియంట్స్ కొనసాగారు. అతని వయస్సు 58 ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో సూసీ వైల్స్ నియామకం అయ్యారు. ఆమె వయస్సు 67ఏళ్లు.
నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ :
జో బైడెన్ కేబినెట్ జేక్ సుల్లివన్ కొనసాగారు. అతని వయస్సు 47ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో మైఖేల్ వాల్ట్జ్ నియామకం అయ్యారు. అతని వయస్సు 50ఏళ్లు.
యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ :
జో బైడెన్ కేబినెట్ లో లాయిడ్ ఆస్టిన్ కొనసాగారు. అతని వయస్సు 71ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో ప్రస్తుతం పీట్ హెగ్‌సేత్ నియామకం అయ్యారు. ఆయన వయస్సు 44ఏళ్లు.
సీఐఏ డైరెక్టర్ :
జో బైడెన్ కేబినెట్ లో విలియం బర్న్స్ కొనసాగారు. అతని వయస్సు 68ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో ప్రస్తుతం జాన్ రాట్‌క్లిఫ్ నియామకం అయ్యారు. అతని వయస్సు 59ఏళ్లు.
యూఎస్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ..
జో బైడెన్ కేబినెట్ లో అలెజాండ్రో మయోర్కాస్ కొనసాగారు. అతని వయస్సు 64ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో ప్రస్తుతం క్రిస్టి నోయెమ్ నియామకం అయ్యారు. ఆమె వయస్సు 52ఏళ్లు.
ఐరాసలో యూఎస్ రాయబారి :
బైడెన్ కేబినెట్ లో లిండా థామస్ పనిచేశారు. ఆమె వయస్సు 72ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో ఎలిస్ స్టెఫానిక్ నియమాకం అయ్యారు. ఆమె వయస్సు 40ఏళ్లు.
బోర్డర్ జార్ :
బైడెన్ కేబినెట్ లో కమలా హారిస్ కొనసాగేవారు. ఆమె వయస్సు 60ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో టామ్ హోమన్ నియామకం అయ్యారు. అతని వయస్సు 62ఏళ్లు.
డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్సీ :
బైడెన్ కేబిటనెట్ లో అవ్రిల్ హైన్స్ కొనసాగారు. ఆమె వయస్సు 55ఏళ్లు.
ట్రంప్ కేబినెట్ లో తులసీ గబ్బార్డ్ నియామకం అయ్యారు. ఆమె వయస్సు 43ఏళ్లు.