Effect of vasanta ritu on Birds : ముందే వచ్చేస్తున్న వసంతకాలం,చనిపోతున్న పక్షి పిల్లలు..! ఆందోళనకర కారణాలు

వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వసంతకాలం ముందే వచ్చేస్తోంది. దీంతో పక్షుల సంతానోత్పత్తిపైనా..వాటి పిల్లలు బతికే పరిస్థితిపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పక్షి పిల్లలు చనిపోతున్నాయి. మరి వసంత రుతువుకు పక్షులకు సంబందమేంటీ? వసంతరుతువు ఎందుకు ముందుగానే వస్తోంది..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..?

Effect of vasanta ritu on Birds : ముందే వచ్చేస్తున్న వసంతకాలం,చనిపోతున్న పక్షి పిల్లలు..! ఆందోళనకర కారణాలు

birds food have nest

Updated On : July 6, 2023 / 6:02 PM IST

Birds food time vasanta ritu : మనిషి అవలంభించే విధానాల వల్ల ప్రకృతి కూడా తన క్రమాన్ని మార్చుకుంటోంది. అకాల వర్షాలు,వర్షాలు కురిసే కాలంలో ఎండలు ఇలా ప్రకతి గాడి తప్పుతోంది. ఇవన్నీ మనిషి చేసుకునే స్వయంకృతపరాధాలే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్లాస్టిక్ వాడకం వంటివి పర్యావరణానికి హాని కలిగించటమే కాదు అభివృద్ధి పేరుతో పరిశ్రమలతో పెరుగుతున్న కాలుష్యం ప్రకతి గాడి తప్పటానికి కారణమవుతోంది. ఈ భూమ్మీద మనిషి ఒక్కడితే కాదు. అనంతకోటి జీవరాశిది అని కూడా మనిషి మర్చిపోతున్నాడు. అభివృద్ధి, టెక్నాలజీ అంటూ పరుగులు పెడుతున్న మనిషి అదే సమయంలో ఈ భూమికే చేటు చేస్తున్నాడు. తద్వారా ఈ భూమ్మీద నివసించే జీవరాశి మనుగడకు ముప్పు తెస్తున్నాడు.

ఇప్పటికే ఎన్నో రకాల జీవరాశులు అంతరించిపోయాయి. మరెన్నో అంతరించిపోవటానికి చేరువలో ఉన్నాయి. అయినా మనిషి మారటం లేదు. ప్రకృతి దినచర్యల్లో వస్తున్న మార్పులు పక్షుల సంతానోత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పచ్చదనానికి మారుపేరు..వసంత రుతువు ముందుగా జరుగుతోందని..దాని వల్ల పక్షులు గుడ్లు పెట్టే కాలం ముందే వస్తోందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. దీని వల్ల పక్షలు గుడ్లు పెట్టే సమయం (Birds eggs time)కూడా ముందుకు జరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ఫలితంగా ఓ పక్షి జంట మూడు నుంచి నాలుగు గుడ్లు పెడితే ఆ గుడ్లు పిల్లలు బయటకొచ్చి జీవించే క్రమంలో వాటి ప్రాణాపాయం కలుగుతోందని తెలిపారు.

Whale Of Fortune : తిమింగలం కడుపులో రూ.44 కోట్ల అంబర్‌గ్రిస్‌ నిధి!

వేడెక్కుతున్న వాతావరణం కారణంగా వసంత రుతువు ముందే వస్తోందని.. దీంతో పక్షులు గుడ్లు పెట్టే సమయం కూడా ముందుకు జరుగుతోందని..ఫలితంగా అవి తక్కువగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. నాలుగు గుడ్లు పెడితే వాటిలో ముందుగా గుడ్డునుంచి బయటకు వచ్చిన పిల్లలు ఆ వాతావరణానికి తట్టుకోలేక చనిపోతున్నాయట. దీనికికారణం వాటికి తగిన ఆహారం అందుబాటులో లేకపోవటం. దీంతో వాటి సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతోందని తెలిపారు. భూతాపం పెరిగే కొద్దీ ఈ సమస్య మరిత తీవ్రమవుతుందని హెచ్చరించారు.

అమెరికా(United States Of America)లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(University of California), మిషిగన్‌ స్టేట్‌ యూనివర్సిటీ (Michigan State University) శాస్త్రవేత్తలు సయుక్తంగా నిర్వహించే పరిశోధనలు ఈ విషయాలు వెల్లడయ్యాయి. పక్షులు నిర్దిష్ట సమయంలోనే (ప్రకృతిపరంగా అదే సీజన్ లో)గుడ్లు పెట్టాలి. ఈ ప్రక్రియ ముందుకు లేదా వెనక్కి జరిగితే ఇదిగో ఇటువంటి పరిణామాలే జరుగుతాయని తెలిపారు. అవి గుడ్లు పెట్టే సమయం నుంచి పొదిగి పిల్లలు బయటకు వచ్చే సమయం చాలా కీలకమైనది. అలాగే గుడ్డులోంచి పిల్లలు బయటకు వచ్చే సమయానికి దానికి అనుగుణంగా వాతావరణం ఉండాలి. లేదంటే అవి చనిపోతాయి. గుడ్లు పెట్టే సమయంలో ప్రతికూల వాతావరణం ఉంటే.. అప్పుడే కళ్లు తెరిచిన పక్షి పిల్లలు త్వరగా చనిపోతాయి. ఇప్పుడు జరుగుతోంది అదేనంటున్నారు శాస్త్రవేత్తలు. పక్షులు గుడ్లు పెట్టాలంటే వాటికి ఆహారం అందుబాటులో ఉండాలి. అంటే రుతువులు సీజన్ ను బట్టి ఆయా పక్షి జాతులు గుడ్లు పెడుతుంటాయి. అలా ఆయా జాతులు గుడ్లు పెట్టే సమయంలో వాటికి అవసరమైన ఆహారం అందుబాటులో ఉండాలి. కానీ వాతారణంలో జరుగుతున్న మార్పుల వల్ల అది జరగటంలేదు.

Afghanistan : బ్యూటీ పార్లర్స్ మూసేయాలి.. మహిళలకు తాలిబన్‌ ప్రభుత్వం హెచ్చరిక

ఆయా జాతుల పక్షులు గుడ్లు పెట్టాలి అంటే   వాటికి తగిన ఆహారం అందుబాటులో ఉండే సమయం కూడా చాలా చాలా ప్రధానం. గుడ్లు పెట్టే సమయంలో పక్షులకు సహజసిద్ధంగా ఆహారం అందుబాటులో ఉండటం కూడా చాలా ముఖ్యం. లేకుంటే అవి గుడ్లు పెట్టటానికే కాదు గుడ్లలోంచి పిల్లలు బయటకు రావటం వంటి ప్రక్రియతో పాటు పిల్లలు బయటకు వచ్చే సమయానికి పిల్లలు తగిన ఆహారం అందుబాటులో ఉండాలి. అలా జరగకపోతే పక్షి పిల్లలకు సరిగా ఆహారాన్ని అందించలేవు. వసంత రుతువు ముందే రావడం వల్ల వాతావరణం, ఆహారం వంటి అంశాల పరంగా తలెత్తే వైరుధ్యాలతో పక్షుల సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. 2001 నుంచి 2018 మధ్య ఉత్తర అమెరికా వ్యాప్తంగా 179 ప్రదేశాల్లో పక్షుల తీరుతెన్నులను పరిశీలించి శాస్త్రవేత్తలు ఇటువంటి నిర్ధారణకు వచ్చారు.