JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి

అమెరికాలోని ఓహియో రాష్ట్రం, సిన్సినాటిలోని ఈస్ట్ వాల్నట్ హిల్స్‌లో జేడీ వ్యాన్స్‌కు ఉన్న ఇంటిపై ఈ దాడి జరిగింది.

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి

JD Vance (Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 7:03 PM IST
  • అమెరికాలోని సిన్సినాటిలో జేడీ వాన్స్‌ ఇల్లు
  • గత రాత్రివేళ దాడి, విచారణ షురూ
  • పోలీసుల అదుపులో అనుమానితుడు

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరిగింది. కిటికీలు పగిలిపోయాయి. అమెరికాలోని ఓహియో రాష్ట్రం, సిన్సినాటిలోని ఈస్ట్ వాల్నట్ హిల్స్‌లో జేడీ వ్యాన్స్‌కు ఉన్న ఇంటి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రివేళ ఈ దాడి జరిగిందని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది, స్థానిక పోలీసు విభాగం పేర్కొంది.

సోమవారం తెల్లవారుజామున జేడీ వాన్స్‌ నివాసానికి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు చేరుకున్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేశారా? అనే విషయాన్ని అధికారులు నిర్ధారించలేదు.

ఈ ఘటన సమయంలో వాన్స్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని ఓ అధికారి తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. జేడీ వాన్స్‌ ఇంట్లోకి నిందితుడు ప్రవేశించలేదని అధికారులు భావిస్తున్నారు.

నూతన సంవత్సరం సెలవుల సమయంలో ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టంగా ఉంది. ఆదివారం వరకు వాన్స్ నివాసం చుట్టూ రహదారులు మూసివేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

Also Read: ONGC Gas Leak: ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీక్‌.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు ఆదేశాలు

భద్రతా ముప్పు ఉందన్న వేళ ఘటన
గత వారం వెనెజువెలాలో అమెరికా ఆపరేషన్ కొనసాగుతున్న వేళ ఆ దృశ్యాలను చూడడానికి డొనాల్డ్ ట్రంప్, ఇతర సీనియర్ పరిపాలనా అధికారులు మార్ ఏ లాగోలో ఉన్న సమయంలో వాన్స్ దానికి హాజరు కాలేదు.

వాన్స్‌ హాజరైతే ఆపరేషనల్ సెక్యూరిటీకి ముప్పు ఉండొచ్చన్న ఆందోళనలే అందుకు కారణం. ఆ సమయంలో వాన్స్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. అది పూర్తయ్యాక సిన్సినాటికి విమానంలో తిరిగివచ్చారు.

భద్రతా కారణాల రీత్యా ట్రంప్‌, జేడీ వాన్స్‌ ఇద్దరూ వైట్‌హౌస్‌ కాకుండా ఇతర ప్రాంతాల్లో ఒకే సమయంలో ఉండే సందర్భాలు తగ్గించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.