Don Gore Sky : 30,000 బర్గర్లు తిని గిన్నిస్ రికార్డు సృష్టించిన వ్యక్తి

బర్గర్. చాలామంది ఇష్టంగా తినే ఫుడ్. ఎంత ఇష్టమైనా వాటిని ఎక్కువ తినలేరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 30,000 బర్గర్లు తిని గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశాడు.

Don Gore Sky : 30,000 బర్గర్లు తిని గిన్నిస్ రికార్డు సృష్టించిన వ్యక్తి

Eaten 30,000 Mcdonald's Big Macs

Updated On : August 6, 2021 / 12:41 PM IST

Wisconsin man Eaten 30,000 McDonald’s Big Macs : బర్గర్. చాలామంది ఇష్టంగా తినే జంక్ ఫుడ్. ఎంత ఇష్టమైనా వాటిని ఎక్కువ తినలేరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా వేలాది మెక్ డొనాల్డ్ బర్గర్లు తినేసి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశాడు. బర్గర్ అంటే ఎంత ఇష్టమైనవారైనా మహా అయితే ఎన్ని బర్గర్లు తినగలరు? పదులు లేక వందలు అంటే చాలాచాలా కష్టమనే చెప్పాలి.

కానీ యూఎస్ లోని విస్కాన్సిన్‎కు చెందిన 64 ఏళ్ల డాన్ గోర్స్కే అనే వ్యక్తి మాత్రం ఏకంగా 30,000 బర్గర్లు తిని గిన్నీస్ రికార్డు క్రియేట్ చేశాడు. డాన్ గోర్‎స్కె కు మెక్ డొనాల్డ్ కు చెందిన బర్గర్ అంటే ప్రాణం. అలా 46 సంవత్సరాలలో 30వేల బర్గర్లు తిని అందరిని ఆశ్చర్య పరుస్తూ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. 46 ఏళ్ల కిందట మొదటగా డాన్ ఓ బర్గర్ తిన్నాడతడు.అది అతనికి చాలా బాగా నచ్చేసింది. అలా ప్రతీరోజు బర్గర్లు తినందే అతనికి కడుపు నిండదు..మనస్సు తృప్తి పడదు. అలా 46 ఏళ్లలో 30 వేల బర్గర్లు తినేశాడు.

1972 మే 17 నుంచి మొదలుపెట్టి ఆ రోజు నుంచి ప్రతి రోజూ కనీసం రెండు బర్గర్ అయినా తాను తిన్నానని ఒక్కరోజు బర్గర్ తినకపోయినా తనకు ఏదో వెలితిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు బర్గర్ ప్రియుడు బాన్ గోక్స్కే. అంటే వారానికి 14 తినేవాడు. బర్గర్ తినటం అనేది అతని జీవితంలో భాగం అయిపోయింది. గోర్‎స్కె బర్గర్ తినటం ఓ దినచర్యగా మార్చేసుకున్నాడు. అతను అలా బర్గర్ తిన్నప్పుడల్లా గుర్తుండేలా కేలండర్ లో రాసుకునేవాడట. ఆ బర్గర్‎కి సంబంధించిన బాక్స్ లేదా పే బిల్లులను దాచిపెట్టుకునేవాడు. ఈ క్రమంలో 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గోర్‎స్కె రికార్డును గుర్తించింది.

2016లోనే అత్యధిక బర్గర్లు (28788) తిన్న వ్యక్తిగా ప్రకటించింది. తాజాగా స్థానిక మెక్ డొనాల్డ్స్ ఔట్‎లెట్ల‎లో 30 వేల బర్గర్లు తిని మరో రికార్డు నెలకొల్పాడు. అయితే హామ్‎బర్గర్స్ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఇన్ని తిన్నానని గోరె‎స్కె తెలిపాడు. ఎన్ని బర్గర్లు తిన్నా… ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదన్నారు. ఎందుకంటే బర్గర్ అంటే తనకు అంత ఇష్టమని తెలిపాడు.