Rs 40 Crore Claiming..Pasta Company : చెప్పిన టైమ్‌కి పాస్తా ఉడకలేదని ‘ఫుడ్ కంపెనీపై రూ. 40 కోట్లు’ దావా వేసిన మహిళ

చెప్పిన టైమ్‌కి పాస్తా ఉడకలేదని సదరు ఫుడ్ కంపెనీపై ఓమహిళ రూ. 40 కోట్లు’ దావా వేసింది. మీరు ప్రటించిన టైమ్ కు పాస్తా ఉడకలేదు కాబట్టి పరిహారం కింద రూ.40 కోట్లు..జరిగిన జరిగిన నష్టానికి రూ.80లక్షల చెల్లించాలని కోర్టులో కేసు వేసింది...!!

Rs 40 Crore Claiming..Pasta Company : చెప్పిన టైమ్‌కి పాస్తా ఉడకలేదని ‘ఫుడ్ కంపెనీపై రూ. 40 కోట్లు’ దావా వేసిన మహిళ

Rs 40 Crore Claiming..Pasta Company

Updated On : November 29, 2022 / 2:38 PM IST

Rs 40 Crore Claiming..Pasta Company : టూ మినిట్స్ మ్యాగీ..ఇది మ్యాగీ నినాదం. ఆకలేస్తే రెండే రెండు నిమిషాల్లో మ్యాగీ చేసేసుకుని లాగించేయొచ్చు. కానీ రెండంటే రెండు నిమిషాల్లోనే మ్యాగీ తినటానికి రెడీ అయిపోతుందా?అంటే అబ్బే అంటాం. కనీసం ఐదారు నిమిషాలైనా పడుతుంది. ఇదంతా కేవలం ప్రచారం కోసమే..కానీ ‘టూ మినిట్స్ మ్యాగీ’అనే మాట అలా స్థిరపడిపోయింది. రెండు నిమిషాల్లో మ్యాగీ తయారవ్వలేదని ఎవ్వరు ప్రశ్నించరు. పెద్దగా పట్టించుకోం. కానీ ఓ మహిళ మాత్రం ‘మూడు నిమిషాల్లో పాస్తా ఉడుకుతుంది‘ అని చెప్పిన కంపెనీపైన ఏకంగా దావా వేసింది. ఒక లక్షా రెండు లక్షలు కాదు కోటి రూపాయలు కూడా కాదు ఏకంగా రూ.40కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదరు ఫుడ్ కంపెనీపై దావా వేసింది…!‘ మా ఫుడ్ రెండు నిమిషాల్లో రెడీ.. మూడు నిమిషాల్లో రెడీ..’ అని ఇనిస్టెంట్ ఫుడ్ ప్యాకెట్స్ పై ఇచ్చే వివరాల మీద కోర్టులో దావా వేసింది..!!

ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను సేల్ చేసుకోవటానికి ముఖ్యంగా ఇన్ స్టాంట్ ఫుడ్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి టూ మినిట్స్ త్రీ మినిట్స్ లో రెడీ అంటూ ప్రకటిస్తాయి. కానీ సదరు కంపెనీలు చెప్పినట్లుగా అవి ఉడకవు. కాస్త సమయం ఎక్కువే పడుతుంది. సదరు కంపెనీలు చెప్పిన సమయం కంటే ఎక్కువ తీసుకుంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోం.కానీ ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ అలా ఊరుకోలేదు. ప్రకటించటం కాదు అమల్లో ఉండాలంటూ ఏకిపారేసింది. అంతటితో ఊరుకోకుండా మీరు చెప్పిన టైమ్ లో మీ కంపెనీ పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదు కాబట్టి రూ.40కోట్లు కట్టాల్సిందే అంటూ కోర్టులో దావా వేసింది.

ఫ్లోరిడాకు చెందిన అమాండా రెమీ రేజ్.. క్రాఫ్ట్ హీంజ్ కంపెనీకి చెందిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్ ను కొనుగోలు చేసింది. దాన్ని మైక్రోవేవ్లో ఉడికిస్తే మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని ప్యాక్ మీద ఉంది. కానీ అందులో చెప్పినట్లుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదు. దీంతో పాకెట్ మీద ఉన్న వివరాలు వినియోగదారులను పక్కదారి పట్టించే విధంగా ఉందని అమండా ఆరోపిస్తూ..మీరు ప్రటించిన టైమ్ కు పాస్తా ఉడకలేదు కాబట్టి పరిహారం కింద రూ.40 కోట్లు..జరిగిన జరిగిన నష్టానికి రూ.80లక్షల చెల్లించాలని కోర్టులో కేసు వేసింది…!! అది వినియోగదారుడి దెబ్బ అంటే అన్నట్లుగా ఉంది కదూ..