Australia : కంగారూ నుండి మహిళను రక్షించాడు.. ఆ తరువాత కంగారూ అతడికి చుక్కలు చూపించింది
ఎంత క్షీరదాలైన ఒక్కోసారి మనుష్యులపై దాడికి తెగబడుతుంటాయి. ఓ కంగారూ టూరిస్ట్ పై దాడి చేసి ఎంత కంగారు పెట్టిందో చూడాల్సిందే.

Australia
Australia : ఒక్కోసారి జంతువులు మనుష్యులతో సరదాగా ప్రవర్తించినట్లు ఉంటాయి. అంతలోనే కఠినంగా ప్రవర్తిస్తాయి. ఓ మహిళను కంగారూ నుంచి టూరిస్ట్ రక్షించాడు. తరువాత అది అతనిపై తీవ్రంగా దాడికి ప్రయత్నించింది. చూసేవారిని కంగారూ దూకుడు భయపెట్టింది.
ఆస్ట్రేలియాలోని పెర్త్ జూలో కంగారూ ఓ మహిళపై దాడి చేయబోతుంది. వెంటనే ఓ యూఎస్ టూరిస్ట్ ఆమెను తప్పించి దానిని అడ్డుకున్నాడు. ఇక కంగారూ అతడిని మామూలుగా భయపెట్టలేదు. దూకుడుగా అతనిపై దాడి చేస్తూనే ఉంది. అతను ఎంత విదిలించుకుందామని ప్రయత్నించినా కాళ్లతో తన్నుతూ అతనిని విడిచిపెట్టలేదు. ఆ టూరిస్టు ఓవైపు భయపడుతూనే నవ్వడానికి ప్రయత్నించాడు. దాని మెడను పట్టుకుని నెట్టడానికి చాలా ప్రయత్నం చేసాడు. అయినా కంగారూ ఏ మాత్రం తగ్గలేదు. @ZeusKingOfTwitt అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
నిజానికి ఈ వీడియోని కంగారూతో పోరాటం చేసిన టూరిస్టు డాటర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మా నాన్నకు కంగారూతో పోరాడే అవకాశం వచ్చిందంటూ’ అంటూ షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. జంతువులలో క్షీరదాలు కూడా అప్పటిదాకా సరదాగా ఉన్నా.. ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తిస్తాయి. దాడికి తెగబడతాయి. అందుకని వాటికి ఎంత దగ్గరలో ఉన్నా ఏమరుపాటుగా ఉండకూడదని ఈ వీడియో రుజువు చేస్తోంది.
Zoo Attack:
American tourist who visited in Perth zoo is forced for Self-defense after kangaroo attacked him for what seems like fight on lady’s heart.#kangaroo #zoo #Australia pic.twitter.com/pR5CHG5qmC— WORLD MONITOR (@ZeusKingOfTwitt) June 13, 2023