Viral Video : సూపర్ మామ్.. క్షణాల్లో స్పందించి బిడ్డను తల్లి ఎలా కాపాడుకుందో చూడండి..
Viral Video : తల్లి తన బిడ్డను కాపాడుకున్న వైనాన్ని కళ్లారా చూసి విస్తుపోయారు. సూపర్ మామ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు

Viral Video(Photo : Google)
Viral Video : చిన్న పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను తమ వెంట తెచ్చుకున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఫోకస్ అంతా వారి మీదే ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. చిన్న పిల్లలను అస్సలు వదిలేయకూడదు. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. పిల్లలు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటారు. వారి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. తల్లితో వచ్చిన ఓ బిడ్డ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. తల్లి తన బిడ్డను క్షణంలో కాపాడుకుంది. లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేది.
Also Read..Viral Video : ప్రాణాలకు తెగించే సాహసం.. నదిపై బైక్ నడిపిన వ్యక్తి వీడియో వైరల్
వీడియోను చూస్తే.. ఓ మహిళ తన చిన్నారితో లిఫ్ట్ నుంచి బయటకు వస్తుంది. ఆ సమయంలో ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో చిన్నారి మెట్ల దగ్గరికి వెళ్లింది. తల్లి ఇది గమనించలేదు. మెట్ల దగ్గరికి వెళ్లిన చిన్నారి తొంగి చూసే ప్రయత్నం చేస్తుంది. అంతే.. ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడబోయింది.(Viral Video)
ఇది గమనించిన తల్లి క్షణ కాలంలో స్పందించింది. ఒక్క ఉదుటిన జంప్ చేసింది. తన బిడ్డ కాలుని పట్టేసుకుంది. బిడ్డ కింద పడకుండా పట్టుకోగలిగింది. చిన్నారి కాలు పట్టుకుని మెల్లగా పైకి లాగేసింది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తల్లి స్పందించిన తీరుకి అంతా అవాక్కవుతున్నారు. ఆమె ఒక్క క్షణంలో స్పందించి చిన్నారిని కాపాడుకుంది. ఏ మాత్రం ఆలస్యమైనా ఘోరం జరిగిపోయి ఉండేది. ఆ తల్లిని సూపర్ మామ్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also Read..corona effect : 2 ఏళ్ల తర్వాత కాఫీ స్మెల్ గుర్తుపట్టిన మహిళ ఎమోషనల్ వీడియో వైరల్
ఇంతలో చుట్టుపక్కల వారు కూడా వచ్చారు. తల్లి తన బిడ్డను కాపాడుకున్న వైనాన్ని కళ్లారా చూసి విస్తుపోయారు. బిడ్డ కిందకిపడిపోతుండగా.. కళ్లారా చూసిన వారు కాసేపు షాక్ లో ఉండిపోయారు. ఆ తర్వాత తేరుకుని.. తల్లిని చప్పట్లతో ప్రశంసించారు. రియల్లీ గ్రేట్ అని పొగిడారు. సూపర్ మామ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఈ ఘటనలో చిన్నారి సేఫ్ గా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.(Viral Video)
Watch the incredible reflexes of a mom when she saves a kid from falling down the stairs? pic.twitter.com/7T2KmFNrpm
— OddIy Terrifying (@OTerrifying) April 9, 2023