Viral Video: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఈ వీడియో మీరూ చూసారా?.. ఆ కుర్రాడు ఎవరు..? ఏంటి ఆ కథ..
నల్లటి దుస్తులు ధరించిన బాలుడు రేసింగ్ బోట్ ముందు నిలబడి, చేతుల ఊపుతూ నృత్యం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Viral Video: సోషలో మీడియాలో రకరకాల వీడియోలు వస్తుంటాయి. రోజూ ఎన్నో వీడియోలు కనిపిస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే తెగ వైరల్ అవుతుంటాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. కొన్ని వీడియోలు సరదాగా ఉంటే మరికొన్ని సందేశాత్మకంగా ఉంటాయి. ఇదే కోవలోకి వస్తుంది తాజా వీడియో ఒకటి. ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆ వీడియోలని కుర్రాడు ఒక్కసారిగా హైలైట్ అయ్యాడు. అసలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఆ వీడియో ఏంటి, ఆ కుర్రాడు ఎవరు, ఏంటి ఆ కథ అనే వివరాల్లోకి వెళితే..
నల్లటి దుస్తులు ధరించిన బాలుడు రేసింగ్ బోట్ ముందు నిలబడి, చేతుల ఊపుతూ నృత్యం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ పిల్లాడు చేసే డ్యాన్స్ చాలా విచిత్రంగా, వింతగా ఉంటుంది. అతడి డ్రెస్, ఎక్స్ ప్రెషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడీ డ్యాన్స్ గురించి అంతా డిస్కస్ చేసుకుంటున్నాయి. ఏంటా డ్యాన్స్ అని ఆరా తీస్తున్నారు. దాన్ని “ఆరా ఫార్మింగ్” అని అంటారు.
ఇక ఈ బోట్ రేసింగ్.. ఇండోనేషియాలో జరిగింది. చరిత్రాత్మక పాకు జాలూర్ పడవ పందెం ఒక సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శన. ఇండోనేషియా బాలుడి ‘ఆరా ఫార్మింగ్’ నృత్యం శతాబ్దాల నాటి సంప్రదాయం. ఇప్పుడు దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అరా ఫార్మింగ్ గ్లోబల్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.
ఆ వీడియోలో హైలైట్ అయిన కుర్రాడు 11 ఏళ్ల రయ్యన్ అర్కాన్ దిఖా. అతడు టోగాక్ లువాన్ పాత్ర పోషించాడు. టోగాక్ లువాన్ అంటే.. రేసింగ్ జట్టు లయ, స్ఫూర్తిని నడిపించే వాడన్నమాట. టోగాక్ లువాన్ సింబాలిక్ డ్యాన్స్ ఇప్పుడు లక్షలాది మందిని ఆకర్షించింది. ఆ పిల్లాడి కమాండింగ్ చేస్తున్నట్లుగా ఉన్న హావభావాలు, ఫోకస్డ్ ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రదర్శనను “ఆరా ఫార్మింగ్” అని అంటారని తెలిసింది.
ఆరా ఫార్మింగ్ అంటే ఏమిటి?
ప్రస్తుతం డిజిటల్ కల్చర్ నడుస్తోంది. తమ సామాజిక ఉనికిని పెంచుకోవడానికి కొత్త కొత్త ఎక్స్ ప్రెషన్లు ఇస్తున్నారు. వైరల్ ట్రెండ్‌లను సృష్టిస్తున్నారు. “ఆరా ఫార్మింగ్” అనేది ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆకర్షణను పొందుతున్న అటువంటి ట్రెండ్.
యువ యూజర్లు తమను తాము షేప్ చేసుకోవడానికి ఆరా ఫార్మింగ్‌ను ఉపయోగిస్తారు. అలా ఇతరుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సాయపడుతుంది. వైరల్ గా మారిన ఈ సాంస్కృతిక సంప్రదాయం స్థానిక ఆచారంలో పాతుకుపోయింది.
రయ్యన్ టాలెంట్ ను గుర్తించి రియావు గవర్నర్ అబ్దుల్ వాహిద్ అతడిని యువ పర్యాటక రాయబారిగా నియమించారు. విద్యా స్కాలర్‌షిప్‌ను ప్రదానం చేశారు. పాకు జాలుర్ సంప్రదాయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో రయ్యన్ పాత్రను అధికారులు ప్రశంసించారు. ఆగస్టు 2025లో జరగనున్న పాకు జాలుర్ జాతీయ ఉత్సవంలో తన సొంత జట్టు తువా కోఘి దుబాలాంగ్ రాజోకు ప్రాతినిధ్యం వహిస్తూ రయ్యన్ మళ్లీ ప్రదర్శన ఇస్తారని భావిస్తున్నారు.
bro’s job is to aura farm pic.twitter.com/aqwyTrezwB
— non aesthetic things (@PicturesFoIder) July 2, 2025