Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి..

వివేక్ రామస్వామి తల్లిదండ్రులది కేరళ రాష్ట్రం. వారు అమెరికాకు వలస వెళ్లారు. వివేక్  ఒహియోలోని సిన్సినాటిలో జన్మించాడు. ప్రస్తుతం అతనికి 37ఏళ్లు. నిక్కీ హెలీ తర్వాత అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తానని ప్రకటించిన రెండో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి వివేక్.

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి..

Vivek Ramaswamy

Updated On : February 22, 2023 / 3:43 PM IST

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు భారత సంతతికి చెందిన వ్యక్తి, ప్రముఖ వ్యాపార వేత్త, రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. రామస్వామి తల్లిదండ్రులది కేరళ రాష్ట్రం. వారు అమెరికాకు వలస వెళ్లారు. వివేక్  ఒహియోలోని సిన్సినాటిలో జన్మించాడు. ప్రస్తుతం అతనికి 37ఏళ్లు. నిక్కీ హెలీ తర్వాత అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తానని ప్రకటించిన రెండో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి వివేక్. నిక్కీ హెలీ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వారే కావటం గమనార్హం. రామస్వామి ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థ ద్వారా వెల్లడించారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్దరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

Elon Musk : 2023లో ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారు : రష్యా మాజీ అధ్యక్షుడు

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నానని ప్రకటించిన తరువాత రామస్వామి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తానని వెల్లడించారు. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని, తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం అని రామస్వామి అభివర్ణించారు. ఇదిలాఉంటే.. రాజకీయంగా వివేక్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి రిపబ్లికన్ పార్టీ తరఫున ఆయన అధ్యక్ష రేసులో నిలబడేందుకు సరైన అభ్యర్థి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

2024 US Presidential campaign: “సోవియట్”లాగే కమ్యూనిస్ట్ చైనా కాలగర్భంలో కలిసిపోతుంది: నిక్కీ హేలీ వార్నింగ్

రామస్వామి హార్వర్డ్, యేల్ యూనివర్శిటీల్లో విద్యనభ్యసించాడు. ఆయన శాకాహారి. వ్యాపారవేత్తగానే గాక.. ఇన్వెస్టర్ గానూ రామస్వామికి పేరుంది. ఔషధ రంగంలో మంచి పేరుంది. గత ఏడాది స్ట్రైవ్ అసెట్ మేనేజ్ మెంట్‌ను స్థాపించారు. 2016లో ఫోర్బ్స్ జాబితా ప్రకారం ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది.