Donald Trump: నాన్సీ ఫెలోసీని ‘ఓ జంతువు’ అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు.. వీడియో

‘‘తమను జంతువులు అని పిలవకూడదని, తాము మనుషులమని నాన్సీ ఫెలోసీ అంటున్నారు. నేను అలా కుదరదని చెప్పాను. వారు జంతువులే. మీరో నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆమె కూడా ఓ జంతువేనని నేను భావిస్తున్నాను’’ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

Donald Trump: నాన్సీ ఫెలోసీని ‘ఓ జంతువు’ అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు.. వీడియో

Donald Trump responds to commit to rejoining the twitter

Updated On : November 8, 2022 / 7:27 PM IST

Donald Trump: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీని ‘ఓ జంతువు’ అంటూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న వేళ ఓహియోలో తాజాగా నిర్వహించిన సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. గతంలో అనవసరంగా తనపై రెండుసార్లు అభిశంసన ప్రవేశపెట్టారని మండిపడ్డారు. గతంలో ఓ టీనేజ్ అబ్బాయిని దారుణంగా పొడిచి చంపిన ఘటనలో ఆమె పాత్ర ఉందని అన్నారు.

‘‘తమను జంతువులు అని పిలవకూడదని, తాము మనుషులమని నాన్సీ ఫెలోసీ అంటున్నారు. నేను అలా కుదరదని చెప్పాను. వారు జంతువులే. మీరో నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆమె కూడా ఓ జంతువేనని నేను భావిస్తున్నాను’’ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

కాగా, గతంలో ట్రంప్ పై కూడా నాన్సీ ఫెలోసీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికాలో ప్రస్తుతం మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ఈ ఎన్నికలు కీలకం. ఆ ఎన్నికలకు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. నవంబరు 15న ఓ కీలక ప్రకటన చేస్తానని కూడా ట్రంప్ అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..