Volodymyr Zelenskyy: విజయం కోసం పోరాడుతూనే ఉంటాం.. కొత్త సంవత్సర సందేశంలో జెలెన్‌స్కీ

నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు పది నెలలు పూర్తైన సంగతి తెలిసిందే. యుక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలకు జెలెన్‌స్కీ సందేశం ఇచ్చారు.

Volodymyr Zelenskyy: విజయం కోసం పోరాడుతూనే ఉంటాం.. కొత్త సంవత్సర సందేశంలో జెలెన్‌స్కీ

Updated On : January 1, 2023 / 10:46 AM IST

Volodymyr Zelenskyy: రష్యా తమపై చేస్తున్న యుద్ధంలో గెలిచే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు పది నెలలు పూర్తైన సంగతి తెలిసిందే.

North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలకు జెలెన్‌స్కీ సందేశం ఇచ్చారు. ‘‘మనం ఇంతకాలం పోరాడాం. ఇకపై కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. విజయం మన సొంతమయ్యే వరకు పోరాడుతూనే ఉంటాం. యుక్రెనియన్లు అద్భుతమైన ప్రజలు. మనం ఏం చేశామో… ఏం చేస్తున్నామో తెలుసుకోండి. యుద్ధం మొదలైన మొదటి రోజు నుంచి మన సైనికులు ఎలా ప్రతిఘటిస్తున్నారో చూడండి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక శక్తి కలిగిన దేశాన్ని మన సైనికులు నిలువరిస్తున్నారు. వాళ్ల సైన్యాన్ని, ఆయుధాల్ని మనవాళ్లు అడ్డుకోగలిగారు. యుద్దంలో చిన్న విషయాలు ఉండవు. అనవసరమైన వ్యక్తులు ఉండరు. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడే.

India: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న భారత్.. లదాఖ్ ప్రాంతంలో ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణం

మనందరం రక్షణ కోసమే ఉన్నాం. మనందరం ఒక్కటిగా పోరాడాం. అన్ని మతాలు, అందరం కలిసి యుద్ధం చేశాం. యుక్రెయిన్‌లోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. మరోవైపు శనివారం కూడా రష్యా దాడులు కొనసాగాయి. యుక్రెయిన్‌లోని కీలక స్థావరాలపై రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది. శనివారం రష్యా 20 మిస్సైళ్లను ప్రయోగించగా, వాటిలో 12 మిస్సైళ్లను కూల్చినట్లు యుక్రెయిన్ ప్రకటించింది.