కరోనావైరస్‌ది మొండిపట్టు. మందులు, వ్యాక్సిన్‌లొచ్చినా 2021లోనూ సహజీనవం తప్పదు. సైంటిస్ట్‌ల అంచనా

తీసుకుంటున్న జాగ్రత్తలు, చికిత్సలను ఓడించి వైరసే గెలుస్తుంది. ఆరు నెలలుగా దాడి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 4లక్షల 54వేల మంది ప్రాణాలు బలిగొంది. వూహాన్ నుంచి సావ్ పౌలో వరకూ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా, అమెరికా, యూరప్‌లలో వ్యాక్సిన్ తయారీ కోసం ప్రాజెక్టులు మరింత వేగంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం చివరికల్లా మందు తయారు చేసి ప్రపంచం మొత్తానికి పంపిణీ చేయాలనేదే టార్గెట్.
2021 వరకూ వ్యాక్సిన్ రెడీ: నిపుణుల అంచనా ప్రకారం.. 2021 వరకూ ప్రభావంతమైన వ్యాక్సిన్ రెడీ అయ్యేదే లేదు. వచ్చే ఏడాది వరకూ కరోనావైరస్ తో కలిసి జీవిస్తూ ఆ మందు కోసం వేచిచూడాల్సిందే. అంచనాలను. అవగాహనను, ప్రవర్తనను రీసెట్ చేసి సంక్షోభంలో తర్వాతి దశను చేరుకోవాలని పబ్లిక్-హెల్త్ ప్రొఫెషనల్స్ అంటున్నారు. సక్సెస్ అనేది క్లియర్ కట్ గా వస్తుందని చెప్పలేం. మళ్లీ 2019లో ఉన్నట్లు లైఫ్ కొనసాగిస్తామని చెప్పలేం.
ఇది టైంను కొనుక్కోవడం, అధికారం కాపాడుకోవడం, ఆస్తులు పాడవకుండా నిలుపుకోవడం వంటివి మహమ్మారి పెరుగుతున్న క్రమంలో చాలా కష్టం. వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణాలు మిలియన్ కు పైగా పెరగొచ్చని భావిస్తున్నారు. మెడికల్ టూల్స్ ప్రభావంతంగా పనిచేసి ట్రీట్ మెంట్ కు అనుకూలం అయ్యేంత వరకూ, వైరస్ కు పోటీగా రోగ నిరోధకశక్తి పెంచుకుంటూ పోవాల్సిందే.
‘ప్రజలు నీరసించిపోయారు. వారంతా పరిస్థితులు చేజారిపోయాయని పొరబాటుపడుతున్నారు. దానికి తగ్గట్లుగా నడుచుకోవడం ఎలాగో నేర్చుకోలేకపోతున్నారు. మేటర్ కాంప్లికేట్ గా మారడం, పొరుగు వారి నుంచి ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపించడం ఒక దేశం నుంచి మరో దేశాన్ని ఒంటరిగా మారుస్తున్నాయి. టెస్టింగ్ లో ఎఫెక్ట్ పెంచడం, కాంట్రాక్ట్ ట్రేసింగ్, సోషల్ డిస్టెన్సింగ్, హాస్పిటల్ సిస్టమ్స్, పబ్లిక్ హెల్త్ మెసేజింగ్ మార్చడం ద్వారా విజయం సాధించొచ్చు.
యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ జైర్ బొల్సొనారో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉండటంతో COVID-19 చావులు ఎక్కువ సంభవిస్తున్నాయని అన్నారు. నిపుణులు, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి సలహాలు తీసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ సమాచారం పంచుకోవడానికి వచ్చే కొత్త మనుషులపై కన్‌ఫ్యూజన్‌తో పాటు అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.
ఇదంతా నిజం కాకపోయినా.. తొలి సంవత్సర అర్థ భాగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అత్యవసర చర్యలకు నాంది పలికాయి. వ్యాపార వ్యవహరాలు నిలిపేయడం, ఇంట్లోనే ఉండడం, సమూహాలుగా పోగు కావడాన్ని నిషేదించడం వంటివి ఇన్ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించాయి. ప్రాణాలు కాపాడటంతో పాటు మెడికల్ ఎక్విప్‌మెంట్ బ్యాకప్ చేసుకోవడానికి ఈ సమయం బాగా ఉపయోగపడింది.
ఆర్థికపరమైన లావాదేవీల విషయానికొస్తే.. నిరుద్యోగం, ట్రిలియన్స్ డాలర్స్ లో పెరిగి సంక్షోభానికి దారి తీశాయి. ప్రభుత్వాలు ఈ హోల్‌సేల్ లాక్‌డౌన్‌లను మరెప్పుడూ విధించకూడదనేంతలా మారాయి. ఆర్థికంగా మళ్లీ పుంజుకోవడానికి అన్ని రంగాలు పునరుద్ధరించినప్పటికీ రెస్టారెంట్లను ఓపెన్ చేయలేకపోయారు. బయట తిరిగేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి అనే అధికారులు తినేటప్పుడు మాస్క్ వేసుకోవడం ఎలా కుదురుతుందంటూ దానిని ఖండిస్తున్నారు.
కరోనా రిస్క్ తీసుకోకుండా పనులు పూర్తి చేయగలగడం అనేది కుదరని పని. వైరస్ తో పోరాడుతూనే పనులు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
అమెరికాలో మహమ్మారి మరింత వేగంగా వ్యాపించింది. ఫ్లోరిడా, టెక్సాస్, అరిజోనా, న్యూయార్క్, లాటిన్ అమెరికా లాంటి ప్రధాన నగరాల్లో వ్యాప్తి చెందడం ఆర్థికంగా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. బ్రెజిల్ లో మరింత దారుణంగా ఉంది. కారణమేమంటే అక్కడ రూరల్ సెంటర్లు, అర్బన్ సెంటర్లలో బలహీనమైన హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉండడం వల్ల కొత్త భూకంప కేంద్రంగా మారిపోయింది.
ఓ సారి లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన అంతా ముగిసిపోయినట్లు కాదు. పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలనేది తెలుసుకోవాలని నిపుణుల సలహా. ప్రభావంతమైన మందు కనిపెట్టేంత వరకూ లాక్ డౌన్ గేట్లు త్తేసినా.. వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిందే.
బయోటెక్నాలజీ కంపెనీ మోడర్నా ఇన్‌క్లూజివ్, అనేక చైనా ప్రోగ్రాం, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా పీఎల్సీ సెప్టెంబరు నాటికి వ్యాక్సిన్ తయారు చేస్తామంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం.. వచ్చే ఏడాది కల్లా 2బిలియన్ డోస్ ల వ్యాక్సిన్ రెడీ అవుతుందని చెబుతుంది. చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. అది ప్రపంచ జనాభాలో 1/3వ వంతు మందికి ఇది సరిపోతుందన్నారు.
భవిష్యత్ వ్యాక్సిన్లు వచ్చినా సుదీర్ఘ కాలం పాటు ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేయలేవు. SARS-CoV2 ఇతర వైరస్ లాంటివే. సాధారణ జలుబు ఎలా సోకుతుందో అలాగే వ్యాపిస్తుంది. టెస్టింగ్ అనేది క్రూషియల్ కాబట్టి చాలా దేశాలు దాని సామర్థ్యాన్ని పెంచుకుని వైరస్ ను కట్టడి చేయడానికి ప్రయత్నించాలని హైజిన్ & ట్రాపికల్ మెడిసిన్ లండన్ స్కూల్ ప్రొఫెసర్ డేవిడ్ హేమన్ అంటున్నారు.
Read: ప్రతి ఏడాదిలో ఫాదర్స్‌డే.. జూన్ 3 ఆదివారం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?