Lab Grown Diamond: వజ్రాలను ల్యాబ్‌లో తయారు చేస్తారా.. ఇంతకీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ఏంటి?
వీటిని సింథటిక్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. నాచురల్ డైమండ్స్ తరహాలోనే వీటికి కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రత్యేకంగా ఎవరైనా చెబితే తప్ప వీటిని ల్యాబరేటరీలో తయారు చేసినట్టు గుర్తించలేం.

Lab Grown Diamond
Man Made Diamonds: స్టేట్ విజిట్ ఇన్విటేషన్పై తొలిసారిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టిన ప్రధానమంత్రి మోదీ(PM Modi).. అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden)తో పాటు ఫస్ట్‌లేడీ జిల్ బైడెన్(Jill Biden)కు ఎన్నో కానుకలు ఇచ్చారు. రాజస్థాన్‌లో తయారు చేసిన మైసూర్ శాండిల్‌వుడ్ బాక్స్… కోల్‌కతాకు చెందిన ఓ కుటుంబం తయారు చేసిన గణేశుడి ప్రతిమ, దీపపు కుందె ఇలా చాలా బహుమతులు ఇచ్చారు. అయితే వీటన్నింటికీ మించి.. అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్‌కు మోదీ అరుదైన కానుకను అందించారు.. అదే 7.5 కారెట్ల గ్రీన్ డైమాండ్. ఇది మామూలు వజ్రాభరణం(diamond ornament) కాదు.. దీనిని లాబ్ గ్రోన్ డైమాండ్ (lab grown diamond) అని పిలుస్తారు. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్.
ఇంతకీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ఏంటి?
సాధారణంగా వజ్రాలు భూమిలో సహజసిద్ధంగా లభిస్తుంటాయి. అయితే అదే తరహా వజ్రాలను కృత్రిమంగా ల్యాబుల్లో తయారు చేస్తే వాటిని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్‌గా పిలుస్తారు. సహజం సిద్ధంగా ఏర్పడే వజ్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉంటాయి. ఇలా తయారు చేసిన వజ్రాభరణమే జిల్ బైడెన్ చేతికి ఇచ్చారు మోదీ. వీటిని సింథటిక్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. నాచురల్ డైమండ్స్ తరహాలోనే వీటికి కెమికల్ , ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రత్యేకంగా ఎవరైనా చెబితే తప్ప వీటిని ల్యాబరేటరీలో తయారు చేసినట్టు గుర్తించలేం. అంత సహజంగా ఉండటం వీటి స్పెషాలిటీ.
మొదటి ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఏది?
1954లోనే మొట్టమొదటి సారిగా ప్రయోగశాలలో వజ్రాన్ని సృష్టించారు. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ న్యూయార్క్‌లోని రీసెర్చ్ ల్యాబొరేటరీలో దీనిని తయారు చేసింది. ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయడంలో వజ్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని కట్టర్స్గా ఉపయోగిస్తారు. వజ్రాలకున్న థర్మల్ కనెక్టివిటీ కారణంగా పారిశ్రామిక అవసరాల కోసం వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన జీఈ కంపెనీ తమ అవసరాల కోసం ల్యాబ్ గ్రోన్ డైమాండ్స్ ను తయారు చేయడం మొదలు పెట్టింది.
Also Read: జోబిడెన్ దంపతులకు మోదీ ఏం బహుమతులు ఇచ్చారంటే…
కృత్రిమంగా డైమండ్‌ను ఎలా తయారు చేస్తారు?
సహజసిద్ధంగా వజ్రం ఏర్పడాలంటే…భూమి పొరల్లో వందల వేల సంవత్సరాల పాటు మూలకం ఎన్నో చర్యలకు లోనవ్వాలి. ఆ తర్వాత ముడి వజ్రాన్ని ఎంతో ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే తళతళమెరిసే డైమాండ్ మన చేతికి వస్తుంది. మరి ల్యాబ్‌లో ఎలా తయారు చేస్తారు ? ప్రకృతి సిద్ధంగా ఉండే వాతావరణం ల్యాబరోటరీలో ఉంటుందా ? అలాంటి వాతావరణాన్ని ఆర్టిఫిషియల్‌గా సృష్టించగలిగారు శాస్త్రవేత్తలు. ల్యాబ్‌లో వజ్రాలను తయారు చేయడానికి రెండు రకాల పద్దతులున్నాయి. హై ప్రెజర్ హై టెంపరేచర్ అనే పద్దతిలో గ్రాఫైట్ కార్బన్‌ను 1500 డిగ్రీల సెల్సియస్ వద్ద మండించి వజ్రంగా మారుస్తారు. ఇక రెండో పద్దతి పేరు కెమికల్ వేపర్ డిపోజిషన్… శక్తివంతమైన కార్బన్ గ్యాస్ ఉన్న చాంబర్లో మూల కణాన్ని ఉంచడం ద్వారా కొంతకాలానికి అది వజ్రంగా మారుతుంది.
కృత్రిమ వజ్రాలను తయారు చేయాల్సిన అవసరం ఏంటి.. వివరాలకు ఈ వీడియో చూడండి..