Two Vaccines Mixed 2 doses : రెండు డోసులు, రెండు రకాల వ్యాక్సిన్లు వేసుకుంటే ఏమవుతుంది? క్లారిటీ ఇచ్చిన ఆక్స్​ ఫర్డ్​ వర్సిటీ సైంటిస్టులు

కరోనా వ్యాక్సిన్ల ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుుతున్న క్రమంలో రెండు డోసులు..రెండు రకాల వ్యాక్సిన్లు వేస్తే ఏమవుతుంది? అనే అంశంపై ఆక్స్ ఫర్డ్ వర్శిటీ సైంటిస్టులు క్లారిటీ ఇచ్చారు.

Two Vaccines Mixed 2 doses : రెండు డోసులు, రెండు రకాల వ్యాక్సిన్లు వేసుకుంటే ఏమవుతుంది? క్లారిటీ ఇచ్చిన ఆక్స్​ ఫర్డ్​ వర్సిటీ సైంటిస్టులు

What Happens When You Mix 2 Vaccine Shots A Study Has Found This

Updated On : May 13, 2021 / 2:51 PM IST

Two Vaccines Mixed for 2 doses : కరోనా వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో సామాన్య ప్రజలకు ఎన్నో సందేహాలు కొనసాగుతునే ఉన్నాయి. కోవాగ్జిన్ వేయించుకుంటే మంచిదా?కోవీషీల్డ్ వేసుకుంటే మంచిదా? అనే అనుమానాలు.అంతేకాదు ఒక డోస్ కోవీషీల్డ్ వేయించుకున్నాక..కోవాగ్జిన్ వేయించుకుంటే ఏమవుతుంది?అనే డౌట్లు. లేదా ఒకవేళ హెల్త్ వర్కర్లు పొరపాటున ఒక డోసు కోవీషీల్డ్ వేసి..రెండో డోసు కోవాగ్జిన్ వేస్తే పరిస్థితి ఏంటీ? అలా రెండు డోసులు రెండు రకాల వ్యాక్సిన్ వేస్తే ఏమవుతుందనే ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.

ఫస్ట్ డోస్ కొవిషీల్డ్ తీసుకుంటే.. సెకండ్ డోస్ కూడా అదే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కొవాగ్జిన్ విషయంలో కూడా అదే సూచన చేసింది. ఫస్ట్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటే.. సెకండ్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ ఇవే చేస్తున్నాయి. అక్కడక్కడా చెదురు మదురు ఘటనల్లో పొరపాటున రెండు డోసుల్లో రెండు రకాల వ్యాక్సిన్లు వేసిన ఘటనలు జరిగాయి. అలాగే కొన్ని దేశాలు ఫస్ట్ డోస్ ఒక వ్యాక్సిన్ ఇచ్చి.. సెకండ్ డోస్ వేరే వ్యాక్సిన్ ఇస్తున్నాయి. మరి అలాచేస్తే సమస్యలేమీ రావా? అదెంత వరకు సేఫ్? దాని వల్ల కలిగే లాభనష్టలేంటి? అనే అంశాలపై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు అధ్యయనం చేశారు.

మొత్తంగా రెండు డోసులకుగానూ రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేసినా..చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా సమస్యలు రావని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒక డోస్ ఆస్ట్రాజెనెకా, మరో డోస్ ఫైజర్ టీకాలు తీసుకున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని సైంటిస్టులు పరిశీలించారు. ఇలా టీకాలు తీసుకున్న 10 శాతం మందిలో తీవ్రమైన అలసట, తలనొప్పి, జ్వరం వంటి సహజమైన లక్షణాలూ చాలా మందిలో కనిపించాయని ..ఇటువంటి సమస్యలు తప్పించి పెద్దగా సమస్యలు రాలేదని తేల్చారు.

ఈ లక్షణాలు కూడా ఎక్కువ రోజులు ఉండవరి ఒకటి లేక రెండు రోజుల్లో ఈ సమస్యలు సద్దుమణిగిపోతాయని సాధారణమైపోయిందని చెప్పారు.ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే అలసట వారిలో తీవ్రత కొంచెం ఎక్కువగా ఉందని తేల్చారు. ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో అలసట కేవలం 3 శాతం మందిలోనే ఉందనీ తెలిపారు. సైంటిస్టులు చేసిన అధ్యయనంలో 50 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. కానీ వారిలో కంటే యువతలోనే అలసట కాస్త ఎక్కువే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాగా..ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీకాల కొరత ఉంది. ఈ క్రమంలో రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు డోసులుగా వేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న దేశాల్లో ఇటువంటి ప్లాన్స్ అమలు చేస్తే వ్యాక్సిన్ల కొరత ఉన్నాగానీ.. టీకా వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయవచ్చని సూచిస్తున్నారు.