ప్రపంచవ్యాప్తంగా సామాజిక దూరం ఎలా పాటిస్తున్నారంటే!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఇప్పటికైనా కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించండి. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10వేల మందికి అంటుకునే అవకాశం ఉంది. మరి సామాజిక దూరాన్ని ఏ దేశాల్లో ఎలా పాటిస్తున్నారో ఒకసారి చూసేద్దామా?
ఛైనా:
చైనాలోని బీజింగ్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా.. ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్ లిఫ్ట్ లో చుట్టు తాకకుండా బటన్లను ఆపరేట్ చేయడం కుదరకుండా ఒక్కసారి ఉపయోగించి పడేసే కాటన్ స్టిక్స్ పెట్టారు.
ఇటలీ:
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల రూపంలో సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కానీ ఇటలీలోని Cisterninoలో మాత్రం కరోనావైరస్ వ్యాధి బాధితుల ఖనన కార్యక్రమానికి బంధువులు హాజరవుతారు.
కోల్‌కతా:
భారతదేశంలో గత 24గంటల్లో 328 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2వేల69మందికి చేరుకున్నాయి. కోల్‌కతాలోని ప్రజలు షాపుల ముందు పాటిస్తున్న సామాజిక దూరం ఇలా ఉంది.
పశ్చిమ బెంగాల్:
ఛీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ కోసం కోల్‌కతా పోలీసు పోరాట బృందం సామాజిక దూరాన్ని పాటిస్తూ.. వెయిట్ చేస్తున్న దృష్యం.
స్పెయిన్:
గురువారం (ఎప్రిల్ 2, 2020) ఒక్కరోజులో 950 మరణాలు నమోదు అయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 10వేలకు పైగా చేరుకుందని చెప్పారు. దీంతో వుహాన్‌లోని పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ బయట ఫేస్ మాస్క్‌లు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తున్న దృష్యం ఇది.
Jewish Worshippers:
జెరూసలేం యొక్క ఓల్డ్ సిటీలోని ప్రజలు వెస్ట్రన్ వాల్ ప్లాజా దగ్గర ప్రేయర్ చేస్తున్నప్పుడు కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో సామాజిక దూరాన్ని పాటిస్తున్న దృష్యం ఇది.
ఆస్ట్రియా:
ఆస్ట్రియాలోని వియన్నాలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. అందుకని ఫిజియోథెరపిస్ట్ అలాన్ క్లయింట్ టామ్ అనే వ్యక్తి ప్రత్యేకంగా నిర్మించిన ప్లెక్సిగ్లాస్ బాక్స్ ద్వారా సామాజిక దూరాన్ని పాటిస్తూ అతని దగ్గరకు వచ్చిన వారికి వ్యాయమాలు చేసి చూపిస్తున్నాడు.
దక్షిణాఫ్రికా:
దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ సమయంలో దక్షిణాఫ్రికాలోని డర్బన్ సమీపంలో Chatsworthలో కరోనావైరస్ వ్యాప్తి చెందే ప్రయత్నంలో కిరాణా షాపుల ముందు క్యూలో కూర్చుని ఉన్న దృష్యం.
నెదర్లాండ్:
ఇక్కడి Amsterdamలో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకి మరింత పెరుగుతుండటంతో డెలివరీ బాయ్ పిజ్జాను ఇంటి గుమ్మంలో వదిలివేస్తున్న దృష్యం.
బ్రిటన్:
బ్రిటన్‌లోని లండన్‌లో నర్సులు భోజనం దానం చేయడానికి సామాజిక దూరం పాటిస్తూ.. లైన్ లో నిలబడివున్న దృష్యం.
Maidstone:
బ్రిటన్ Maidstoneలోని M20లో మోటార్‌వే సేవలకు వచ్చే ప్రజలకోసం టాయ్‌లెట్‌లో కూడా సామాజిక దూరాన్ని పాటించేందుకు కొన్ని బ్లాక్ చేసి కొన్ని ఉంచారు.
Also Read | ట్రంప్‌కి మరోసారి కరోనా టెస్ట్‌లు.. వైట్ హౌస్ ప్రకటన