George Soros: ఎవరీ జార్జ్ సోరోస్.. అదానీ గ్రూపుతో ఈయనకు ఉన్న లింకేంటి? మధ్యలో ప్రధాని మోదీ ఎందుకు వచ్చారు?

వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల గురించి జార్జ్ సోరోస్ మాట్లాడారు. ప్రతి దేశంలో ఒక నిర్దిష్ట రకమైన అధికారాన్ని సాధించాలని జార్జ్ సోరోస్ ఆరాటపడుతుంటారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి

George Soros: ఎవరీ జార్జ్ సోరోస్.. అదానీ గ్రూపుతో ఈయనకు ఉన్న లింకేంటి? మధ్యలో ప్రధాని మోదీ ఎందుకు వచ్చారు?

Adani Group: హిండెన్‭బర్గ్ రిపోర్ట్ కారణంగా అదానీ గ్రూప్ చవిచూసిన నష్టం తక్కువేం కాదు. ఆరు నెలలుగా ఆ రిపోర్టు మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇది చాలదన్నట్టు మరో రిపోర్ట్ అదానీ గ్రూప్ మెడకు చుట్టుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఆర్గనైజ్డ్ క్రైం అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ (ఓసీసీఆర్పీ) అనే రిపోర్టు సంచలన ఆరోపణలు చేసింది. ప్రమోటర్ కుటుంబంతో భాగస్వామ్యం ఉన్న పలువురు, వందల మిలియన్ డార్లు అదానీ గ్రూప్ స్టాక్సులో పెట్టుబడి పెట్టి లబ్ది పొందినట్లు ఓసీసీఆర్పీ ఆరోపించింది. ప్రముఖ అంతర్జాతీయ మదుపతి జార్జ్ సోరోస్, రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ వంటి వారి పెట్టుబడులు ఇందులో ఉన్నాయని తెలిపింది.

G-20 Summit: పుతిన్ దారిలోనే జిన్‭పింగ్.. జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు హాజరు కావడం లేదట

దీంతో ఈ పెట్టుబడిదారులెవరు? వీరికి అదానీ గ్రూపుతో ఉన్న సంబంధం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జార్జ్ సోరోస్ మీద చర్చ తీవ్రమైంది. అదానీ గ్రూప్‌కు చెందిన వ్యాపార భాగస్వాములు మారిషస్‌లోని అనామక పెట్టుబడి నిధి ద్వారా అదానీ గ్రూప్ షేర్లలో మిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టారని ఓసీసీఆర్పీ తన నివేదికలో ఆరోపించింది. తన దర్యాప్తులో కనీసం అలాంటి రెండు కేసులను కనుగొన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ రెండు సందర్భాల్లో, అనామక పెట్టుబడిదారులు ఆఫ్‌షోర్ స్ట్రక్చర్ ద్వారా అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేసి విక్రయించారని సంస్థ తెలిపింది. అమెరికన్ బిలియనీర్ అయిన జార్జ్ సోరోస్ వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. దాంతో మరింత ఆసక్తి నెలకొంది.

INDIA 3rd Meet: ఇండియా కూటమి కన్వీనర్‭గా నితీశ్ కుమార్‭కే ఎక్కువ మద్దతు.. లాలూ పెట్టిన ఈ షరతుకు ఒప్పుకుంటే నితీశే అధినేత

ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల గురించి జార్జ్ సోరోస్ మాట్లాడారు. ప్రతి దేశంలో ఒక నిర్దిష్ట రకమైన అధికారాన్ని సాధించాలని జార్జ్ సోరోస్ ఆరాటపడుతుంటారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఈ ఉద్దేశ్యంతో ఆయా దేశాల్లోని సంస్థలకు నిధులు సమకూర్చడం, వాటిని తనకు అనుకూలంగా పనిచేసేలా చేసుకోవడం వంటివి చేస్తుంటారట. విశేషమేమిటంటే, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత ఇప్పుడు జార్జ్ సోరోస్ సంస్థ ద్వారా అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకోబోతున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు ఉన్నాయి.

Parliament Special Sessions: ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్రం.. ఇంత హడావుడిగా ఎందుకంటే?

ఈ సోషల్ మీడియా ఊహాగానాల ఆధారంగా ఓసీసీఆర్పీ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. అదానీ గ్రూప్ తాజా ఆరోపణలు విదేశీ మీడియాలోని ఒక వర్గం ప్రయత్నమని పేర్కొనడం గమనార్హం. ఇకపోతే, హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో ప్రపంచంలోని రెండవ బిలియనీర్ జాబితాలో ఉన్న గౌతమ్ అదానీ.. ఒక్కసారిగా టాప్-10 కిందకు పడిపోయారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆధారంగా సెబీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది.