Tibetan : టిబెట్ మీదుగా విమానాలు ఎందుకు ఎగరవు.. అసలు కారణం ఏమిటంటే..

టిబెట్ వాతావరణంలో తరచుగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా కఠినమైన వాతావరణం ఉంటుంది. ఆ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండటం కారణంగా.

Tibetan : టిబెట్ మీదుగా విమానాలు ఎందుకు ఎగరవు.. అసలు కారణం ఏమిటంటే..

Tibetan

Tibetan : టిబెట్ మీదుగా విమానాలు ఎగరవని మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే, ఆ ప్రాంతంపై విమానాలు ప్రయాణించడానికి ఎందుకు అనుమతిలేదో మాత్రం చాలా మందికి తెలియదు. టిబెట్ మీదుగా విమానాలు ప్రయాణించకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి వాతావరణ ప్రతికూలత. టిబెట్ ను పీఠభూమిని ‘రూల్ ఆఫ్ ది వరల్డ్’ అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి సగటున 4,500 మీటర్ల ఎత్తులో ఉంది. అంత ఎత్తులో వాతావరణ పీడనం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఆక్సీజన్ స్థాయి తగ్గుతుంది. విమానం ఎగరాలంటే వాతావరణ పీడనం సరిగ్గా ఉండాలి.

 

టిబెట్ వాతావరణంలో తరచుగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా కఠినమైన వాతావరణం ఉంటుంది. ఆ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండటం కారణంగా.. భారీ హిమపాతం, చల్లని గాలులు వీస్తుంటాయి. ఇలాంటి వాతావరణం విమానాల ప్రయాణాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అత్యవసర ల్యాండింగ్ కు అవకాశం ఉండదు. కాబట్టి ఈ వాతావరణ ప్రమాదాలను నివారించడానికి విమానయాన సంస్థలు టిబెట్ మీదుగా విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వరు. టిబెట్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏరోనాటికల్ సౌకర్యాల నెట్ వర్క్ చాలా పరిమితంగా ఉంది. ఎత్తైన ప్రదేశం, క్లిష్ట భౌగోళికం కారణంగా అక్కడ వాయు రక్షణ చర్యలను రూపొందించడం కష్టం. ఇదేకాకుండా.. టిబెట్ లో ఆదునిక విమానయాన మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్లకూడా విమానాయన సంస్థలు ఇక్కడి నుంచి విమానాలు నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు.

 

మరోవైపు టిబెట్ చైనా యొక్క స్వయంప్రతిపత్త ప్రాంతం. దీనికారణంగా ఆ ప్రాంతంపై విమానాలు రాకపోకలు సాగించాలంటే ప్రత్యేక అనుమతి, భద్రతా ప్రొటోకాల్ అవసరం. ఈ భద్రత, రాజకీయ సమస్యల కారణంగా అంతర్జాతీయ విమానాలు, విమానయాన సంస్థలు తరచుగా టిబెట్ మీదుగా విమానాల రాకపోకలకు ప్రాధాన్యతనివ్వరు. అయితే, ప్రధాన కారణం మాత్రం.. టిబెట్ ఎత్తైన ప్రదేశం కావటం, విమానాల ప్రయాణానికి సరియైన వాతావరణం అక్కడ లేకపోవటమేనని చెప్పొచ్చు.