Woman Reunite Family After 51 Years : 21 నెలల వయసున్నప్పుడు పసికందు కిడ్నాప్.. 51 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు..
అమెరికాలోని టెక్సాస్‌లో పసికందుగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయిన ఓ మహిళ 51 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

woman kidnapped reunite
Woman Reunite Family After 51 Years : చిన్నప్పుడు తప్పిపోయి లేదా కిడ్నాప్ కు గురై పెద్దయ్యాక తల్లిదండ్రుల చెంతకు చేరినవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. పసికందుగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయిన ఓ మహిళ 51 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. 1971 ఆగష్టు 23వ తేదీన 21 నెలల వయసున్న మెలిస్సా హైస్మిత్‌ను బేబీ సిట్టర్ కిడ్నాప్ చేశారు.
బేబీ సిట్టర్ ఆచూకీ తెలపాలని మెలిస్సా తల్లి అట్ల అపన్‌టెన్‌కో న్యూస్‌పేపర్‌లో ప్రకటన కూడా చేశారు. అంతేకాకుండా బేబీ సిట్టర్ కోసం చాలా చోట్ల వెతికారు. కానీ, లాభం లేకపోయింది. దాంతో, వాళ్లు మెలిస్సాను తలచుకుంటూనే గడపసాగారు. అయితే ఈ మధ్యే వాళ్ల నిరీక్షణ ఫలించింది.
Child Reunited: ఆసుపత్రిలో బిడ్డ తారుమారు.. మూడేళ్లకు తల్లిందండ్రుల చెంతకు
51 ఏళ్ల తర్వాత తల్లిదండ్రలు తమ కూతురు మెలిస్సాను మొదటిసారిగా చూశారు. మెలిస్సా తమ కూతురే అని నిర్ధారించడంలో డీఎన్ఏ పరీక్ష ఫలితాలు, ఆమె పుట్టిన తేదీ, ఆమె శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఆధారాలు అయ్యాయి. నవంబర్ 26వ తేదీనీ మెలిస్సా తన అమ్మానాన్న, ఇద్దరు తోబుట్టువులను ఫోర్ట్ వర్త్ చర్చిలో కలుసుకున్నారు.