ఈ వయస్సులో ఎందుకమ్మా: 8 రోజులుగా బాత్ టబ్‌లోనే

ఈ వయస్సులో ఎందుకమ్మా: 8 రోజులుగా బాత్ టబ్‌లోనే

Updated On : November 23, 2019 / 2:38 PM IST

లెన్నీ అనే మహిళ బాత్రూమ్ టబ్‌లో ఇరుక్కుపోయి ఎట్టకేలకు బయటపడింది. ఆహారం కరువై ప్రాణాలతో పోరాటం చేసింది. అలవాటు ప్రకారం.. బాత్ టబ్‌లో స్నానం చేసే మహిళ అందులోకి దిగింది. స్నానం ముగిశాక అది దాటి బయటకు రాలేకపోయింది. ఆ 70ఏళ్ల వృద్ధురాలికి వారానికోసారి వచ్చి సర్వీస్ ఇచ్చే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి కాపాడగలిగింది. 

ఆ మహిళకు సర్వీస్ అందించే కంపెనీ నుంచి డైలీ ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. బాత్ టబ్ నుంచి బయటకు వస్తేనే కానీ, ఫోన్ అందదు. ఈ పరిస్థితుల్లో ఆ ఎనిమిది రోజుల పాటు ఫోన్ కు సమాధానం ఇవ్వలేకపోయింది. ప్రతి రోజూ ఆమెకు ఫోన్ చేయడం రింగ్ అయి ఆగిపోవడంతో అనుమానం వచ్చింది. 

ఆమె ప్రాణాలతో ఉన్న విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు సిబ్బందిని ఒకర్ని పంపడంతో అసలు విషయం తెలిసింది. తలుపులు తెరుచుకోకపోవడంతో పగులగొట్టి లోపలికి వెళ్లాడు. వెంటనే వృద్ధురాలిని ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు.