Sweet Tooth Woman : వామ్మో.. తనకిష్టమైన స్వీట్ కోసం ఏకంగా 200కిమీ ప్రయాణం చేసింది

బ్రిటన్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన పని తెలిసి అంతా విస్తుపోతున్నారు. భూమ్మీద ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని వండర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..? తనకు ఇష్టమైన ఓ స్వీట్ కోసం ఏకంగా 200 కిలోమీటర్లు జర్నీ చేసేంది. ఏంటి? షాక్ అయ్యారా? కానీ, ఇది నిజం.

Sweet Tooth Woman : వామ్మో.. తనకిష్టమైన స్వీట్ కోసం ఏకంగా 200కిమీ ప్రయాణం చేసింది

Sweet Tooth Woman

Updated On : May 22, 2021 / 9:30 PM IST

Sweet Tooth Woman : బ్రిటన్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చేసిన పని తెలిసి అంతా విస్తుపోతున్నారు. భూమ్మీద ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని వండర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..? తనకు ఇష్టమైన ఓ స్వీట్ కోసం ఏకంగా 200 కిలోమీటర్లు జర్నీ చేసేంది. ఏంటి? షాక్ అయ్యారా? కానీ, ఇది నిజం.

ఆమె పేరు విక్కీ గీ. బ్రిటన్ లో ఉంటుంది. ఆమె కేంబ్రిడ్జ్ నుంచి యార్క్ షైర్ లోని బార్న్స్ లే వరకు ఏకథాటిగా 200 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అలా ప్రయాణించి ఆమె డాలీస్ షాప్ కు చేరుకుంది. అక్కడ చేసే బిస్కోస్ పుడ్డింగ్ (ఓ రకమైన స్వీట్) అంటే విక్కీకి చాలా ఇష్టం. కేవలం ఆ స్వీట్ కోసమే ఆమె ఇంత దూరం ప్రయాణం చేసింది.

200 కిలోమీటర్లు దూరం ఎలా ప్రయాణించారని అడిగితే.. జస్ట్ మూడున్నర గంటలు మాత్రమే ప్రయాణం అంటూ ఆమె బదులిచ్చింది. అంటే.. ఆ స్వీట్ కోసం ఆమె రానుపోను 7 గంటల పాటు ప్రయాణం చేసిందన్నమాట. జర్నీ కాస్త ఇబ్బంది అనిపించినప్పటికీ నచ్చిన స్వీట్ కోసం ఇష్టంగా పూర్తి చేశానని చెబుతోంది విక్కీ. అంతేకాదు.. ఆ స్వీట్ కోసం మళ్లీ మళ్లీ వస్తానంటోంది కూడా. ఓ స్వీట్ కోసం విక్కీ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. స్వీట్ కోసం ఇంత దూరం ప్రయాణించిన వ్యక్తి బహుశా ప్రపంచంలో విక్కీ ఒక్కరే అయి ఉండొచ్చని నెటిజన్లు అంటున్నారు.