Swiss military : మహిళల లో దుస్తుల విషయంలో ఆర్మీ కీలక నిర్ణయం

స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించేందుకు స్విస్ ఆర్మీ (Swiss military) కీలక నిర్ణయం తీసుకుంది.

Swiss military : మహిళల లో దుస్తుల విషయంలో ఆర్మీ కీలక నిర్ణయం

Swiss military

MEN’S underwear : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆ రంగం..ఈ రంగం అనే తేడా లేదు. పురుషులకు ధీటుగా తాము కూడా రాణిస్తామని చాటిచెబుతున్నారు. అందులో ఆర్మీ రంగం కూడా ఒకటి. అయితే..ఈ రంగంలో ఉండే మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించేందుకు స్విస్ ఆర్మీ (Swiss military) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు ఉపయోగించే లో దుస్తుల విషయంలో ఛేంజ్ చేయాలని భావిస్తోంది. మహిళా సైనికులు కోసం ప్రత్యేక అండర్ వేర్ లు అందుబాటులోకి తెచ్చేందుకు నడుం బిగించింది.

ఇప్పటి వరకు అక్కడి మహిళా సైనికులు పురుషుల కోసం ఉద్దేశించిన పెద్ద సైజు లో దుస్తులను ఉపయోగిస్తూ వచ్చేవారు. కొత్త తరం మహిళలు ప్రవేశించాక..వారు తమ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఆర్మీ విధుల్లో భాగంగా…25 కేజీల బరువు మోస్తున్నప్పుడు కానీ..కింద పడుకుని పాకుతూ వెళుతున్న సందర్భంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ప్రస్తావిస్తున్నారు. దీంతో పరిస్థితిలో మార్పు తేవాలని ఆర్మీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 01వ తేదీ నుంచి ప్రయోగత్మాకంగా..కొత్తరకం అండర్ వేర్ లను అందుబాటులోకి తేనుంది. చలికాలం, ఎండాకాలంలో సౌకర్యవంతంగా ఉండే విధంగా..వీటిని రూపొందించింది. ఇక స్త్రీ, పురుష సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సైనికులు వినియోగించే బ్యాగులు, ఇతర వస్తువుల్లో కూడా మార్పులు తేవాలని సైన్యం యోచిస్తోంది. సైనిక బలగాల్లో 1 శాతంగా..ఉన్న మహిళల సంఖ్యను మరో పది సంవత్సరాల్లో 10 శాతానికి పెంచాలన్న లక్ష్యాన్ని అక్కడి సైన్యం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.