Taliban on Women: ‘మహిళలంటే జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికిరారు’

అఫ్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకుని తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు. ప్రధానమంత్రిగా ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ పరిపాలనలో మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటుచేసుకున్నారు.

Taliban on Women: ‘మహిళలంటే జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికిరారు’

Taliban On Women

Updated On : September 10, 2021 / 10:58 AM IST

Taliban on Women: అఫ్ఘానిస్తాన్‌ను హస్తగతం చేసుకుని తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు. ప్రధానమంత్రిగా ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ పరిపాలనలో మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటుచేసుకున్నారు. మంత్రివర్గంలో మహిళను కూడా తీసుకోకపోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తాలిబన్లకు వ్యతిరేకంగా బుధవారం మహిళలు నిరసన చేపట్టారు. మంత్రివర్గంలో మహిళలు ఉండటంపై తాలిబన్ల ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.

‘మంత్రులుగా మహిళలు పనికి రారు.. కేవలం జన్మనివ్వడానికే పరిమితం’ అని పేర్కొన్నాడు. తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హషిమి ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మహిళలు మంత్రులు కాలేరు. మెడపై ఏదైనా వస్తువు పెడితే మోయలేరు. మంత్రివర్గంలో మంత్రులు తప్పనిసరి కాదు’ అని పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా మహిళల నిరసన ప్రదర్శనపై స్పందిస్తూ ‘నలుగురు మహిళల నిరసన అఫ్గానిస్తాన్‌ మొత్తం మహిళలు ప్రాతినిథ్యం వహించినట్టుగా భావించొద్దు. మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏం జరుగుతుందో మీకో ఉదాహరణ చెబుతా. రెండు దశాబ్దాలుగా కీలుబొమ్మ పరిపాలన కొనసాగలేదా. వ్యభిచారం పెరిగిపోయింది. కార్యాలయాల్లోనే ఏకంగా ఆ వ్యవహారం కొనసాగుతోంది’ అని జెక్రుల్లా స్పష్టం చేశాడు.

‘మహిళలు అఫ్గానిస్తాన్‌ ప్రజలను జన్మనివ్వడానికే పరిమితం కావాలి’ అని వెల్లడించాడు.