Gold Toilet : గోల్డ్ టాయిలెట్ కావాలా..? వేలానికి సిద్ధం.. ప్రారంభ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని చరిత్ర ఇదే..
Gold Toilet : ప్రముఖ ఆర్టిస్ట్ మౌరిజియో క్యాటెలాన్ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్ త్వరలో వేలానికి రానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన
Gold Toilet
Gold Toilet : ప్రముఖ ఆర్టిస్ట్ మౌరిజియో క్యాటెలాన్ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్ త్వరలో వేలానికి రానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన టాయిలెట్ ఇది. ‘అమెరికా’ అనే పేరిట ఈ బంగారు తొట్టెని వేలం వేయనున్నట్లు సోథెబైస్ సంస్థ ప్రకటించింది.
మౌరిజియో క్యాటెలాన్ రూపొందించిన రెండో బంగారం టాయిలెట్ ఇది. మొదటి గోల్డ్ టాయిలెట్ దాదాపు 101.2 కిలో గ్రాములు 18క్యారెట్ల బంగారంతో తయారైంది. ఇది కేవలం ప్రదర్శన వస్తువు మాత్రమే కాదు.. పూర్తిగా పనిచేసే టాయిలెట్ కూడా. సంపన్నుల విలాసాలపై వ్యంగాస్త్రంగా కాటెలాన్ దీనిని రూపొందించారు. దీని కనీస ధరను సుమారు 10 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.83కోట్లు)గా నిర్ణయించారు. ఈ గోల్డ్ టాయిలెట్ ను సోథెబైస్ సంస్థ ఈనెల 18న న్యూయార్క్ లో వేలం వేయనుంది.
2016లో కాటెలాన్ ఇలాంటివి రెండు టాయిలెట్లను తయారు చేశారు. వాటిలో ఒకటి 2019లో ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ప్రదర్శనలో ఉండగా.. దొంగతనానికి గురైంది. దొంగలు దానిని ప్లంబింగ్ తో పాటు పెకిలించుకుని పారిపోయారు. ఆ టాయిలెంట్ ఇప్పటికీ దొరకలేదు. దానిని దొంగలు కరిగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు వేలాది వస్తుంది రెండో బంగారం టాయిలెట్.
Maurizio Cattelan’s ‘America’ is coming to auction at #SothebysNewYork this November—and for the first time ever, bids will open at the price of the object’s weight in gold on the day of the sale. pic.twitter.com/29Twj8UnwQ
— Sotheby’s (@Sothebys) October 31, 2025
ఈ నెల 8 నుంచి వేలం ముగిసే వరకు ఈ ‘అమెరికా’ టాయిలెట్‌ను సోథెబైస్ ప్రధాన కార్యాలయంలోని ఒక బాత్రూంలో ప్రదర్శనకు ఉంచుతారు. సందర్శకులు దీనిని దగ్గర నుంచి చూడవచ్చు. అయితే, గతంలో లాగా దీనిని ఉపయోగించుకునే అవకాశం మాత్రం లేదు. కేవలం చూడగలరు కానీ, ఫ్లష్ చేయలేరు.
