కరోనా వైరస్ తో ఫైట్….అలసిపోయిన నర్సు

ప్రపంచదేశాలన్నీ కలిసి చేస్తున్న ఒకే ఒక యుద్ధం…కరోనా వైరస్. చైనాలో గతేడాది డిసెంబర్ లో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు 110దేశాలకు పాకింది. వ్యాక్సిన్ లేని ఈ భయంకరమైన వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేలమంది ప్రాణాలు కోల్పోడవం అందిరికీ ఆందోళన కలిగిస్తుంది. ఇక చైనా తర్వాత కరోనా ప్రభావం అధికరంగా ఉన్న దేశం ఇటలీ. ఇటలీలో కరోనా దెబ్బకు జనం పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు.
ఇటలీలో ఇప్పటివరకు కరోనా సోకి 1,400మంది ప్రాణాలు కోల్పోగా,21,000మంది వైరస్ సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అంతేకాకుండా ఇటలీలో సగం జనాభాను దిగ్భందనం చేశారు. పర్మీషన్ లేకుండానే ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటకు అడుగుపెట్టకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా నార్త్ ఇటలీలో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఇటలీ దేశంలోని నాలుగోవవంతు ఐసీయూ బెడ్ లు…కరోనా పేషెంట్లతో నిండిపోయాయి.
ప్రపంచంలోని ఉత్తమ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా ఉన్న నార్త్ ఇటలీలోని లొంబార్డీ సాధారణ సమయాల్లో ఇటలీ ఎకనామిక్ హార్ట్ గా ఉంటుంది. అయితే ఈ లొంబార్డీలోని హాస్సిటల్స్ లో మాత్రం ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. సమయంతో సంబంధం లేకుండా కరోనాపై పోరాటమే లక్ష్యంగా నర్సులు,డాక్టర్లు పనిచేస్తున్నారు హాస్పిటల్స్ లో. అయితే ఓ హాస్పిటల్ లో గంటలపాటు వర్క్ తో బిజీగా గడిపి అలసిపోయి కంప్యూటర్ కీబోర్డు పై పడుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న పగ్లియేరిని అనే నర్సు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన ఫొటో వైరల్ అవడంతో పగ్లియేరిని స్పందించింది. అవసరమైతే 24గంటలు పనిచేయడానికి తాను సిదవ్ధమేనని,అయితే తెలియని శత్రువుతో తాము పోరాటం చేస్తున్నందుకు తాను ఆత్రుతతో ఉన్న విషయాన్ని దాచలేనని ఆమె తెలిపారు. తాను నర్సు గెటప్ లోనే కీ బోర్డుపై విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను ప్రతిచోటా చూసి తాను నొచ్చుకున్నానని,నా బలహీనత చూపించడం నాకు సిగ్గుగా ఉంది అని పగ్లియేరిని అన్నారు. అయితే నాపై సానుభూతి చూపిస్తూ చాలామంది ప్రజలనుంచి అద్భుతమైన మేసేజ్ లు వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగిందని ఆమె తెలిపారు. ఒక్క పగ్లియేరినే కాకుండా లంబొర్డీ ప్రాంతాంలోని చాలామంది నర్సులు సమయంతో సంబంధం లేకుండా తమ సేవలను అందిస్తున్నారు.