క్లారిఫై కోసం టెస్టు చేయించుకుంటే COVID-19పాజిటివ్ వచ్చిందా.. అయితే ఇలా చేయండి

క్లారిఫై కోసం టెస్టు చేయించుకుంటే COVID-19పాజిటివ్ వచ్చిందా.. అయితే ఇలా చేయండి

Updated On : July 18, 2020 / 4:44 PM IST

అనుకోకుండా జలుబు, పొడిదగ్గు, గొంతుమంట మొదలయ్యాయా.. ప్రస్తుత పరిస్థితుల్లో మీలో ఓ అనుమానం పెరగొచ్చు. కరోనా సోకిందా అనే భయంతో పాటు కుటుంబం గురించి ఆందోళన పెరిగిపోతుంది. వెంటనే COVID-19టెస్టుకు వెళ్లి నెగెటివ్ రావాలని కోరుకుంటూనే శాంపుల్స్ ఇచ్చి బయటికొచ్చారనుకోండి. ఆ రిజల్ట్ లో పాజిటివ్ వస్తే మన పరిస్థితి ఏంటి అప్పుడు మనమేం చేయాలి.

మొదటగా మీ అనారోగ్యాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవాలి. దాంతోపాటే అది ఇతరులకు వ్యాపించకుండా సెల్ఫ్ ఐసోలేషన్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ ఐసోలేషన్ అంటే ఇంట్లో ఉండడం మాత్రమే కాదు. ఇంట్లో వారికి కూడా దూరంగా ఉండాలి. దాని వల్ల ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.

హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా మీకు సమస్య రావడానికి కారణాలు, ఎలా వ్యాప్తి చెందింది దానిపై ఆరా తీస్తుంది. ఫలితంగా వైరస్ సోకిన మార్గంతో పాటు మరెవరికైనా వ్యాప్తి చెందిందా అనే విషయం అర్థమవుతోంది. COVID-19సోకిన చాలా మందికి ట్రీట్‌మెంట్ ఉపయోగపడటం లేదు. ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకూ కంట్రోల్ చేస్తుంది కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారినప్పుడు హాస్పిటల్ కు వెళ్లడమే ఉత్తమం.

కరోనా సోకి ప్రథమ దశలో ఇబ్బందిపడుతున్న వారికి ఎటువంటి మందు పనిచేయదు. ఎవరైతే సమస్య అధికమై హాస్పిటల్ పాలైయ్యారో వారికి మాత్రమే రెమెడెసివర్, డెక్సామెథాసోనెలు పనిచేస్తాయి. రోగ లక్షణాలను బట్టి మాత్రమే మెడిసిన్ తీసుకోవాలి. తలనొప్పిగా ఉంటే పారసిటమాల్ తీసుకోవచ్చని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ హ్యారీ నెస్పోలన్ ప్రెసిడెంట్ అంటున్నారు.

కండరాల నొప్పులు ఉంటే మాత్రం పెయిన్ కిల్లర్లు వాడాలి. రోజూ లక్షణాలను పరిశీలించుకోవాలి. COVID-19గురించి ట్రీట్ చేయడానికి వీలుంటుంది. ఈ అదనపు సమాచారం కొవిడ్ 19 నుంచి కోలుకోవడానికి, మెడికల్ సమస్యల నుంచి బయటపడటానికి సాయపడుతుంది. సమస్య తీవ్రమైతే మాత్రం కచ్చితంగా హాస్పిటల్ కు వెళ్లాల్సిందే. శ్వాస సమస్యలు, జ్వరం, తలనొప్పి, కంటి చూపు తక్కువ కావడం వంటివి ఎక్కువైతే జాగ్రత్త పెంచాలి. కొవిడ్ 19 కారణంగా శ్వాస సంబంధిత సమస్య ఒక్కటే రాదని తెలుసుకోవాలి.

24 గంటల పాటు పనిచేసే నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్లు, రాష్ట్ర హెల్ప్ లైన్లకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. రాష్ట్రాల వారీగా ట్రీట్ చేసే పద్ధతి మారుతూ ఉండొచ్చు. సాధారణంగా 14రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులకు 12వ రోజు వ్యాధి బయటపడుతున్నట్లు డేటా చెబుతుంది.

మనం చేయాల్సిందల్లా ఫిజికల్ డిస్టెన్స్, చేతులు తరచూ కడుక్కుంటూ ఉండటం, ముఖానికి మాస్క్ లాంటిది ధరించడం.