IPL 2020 DC vs KXIP : సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్ గెలుపు

  • Published By: madhu ,Published On : September 21, 2020 / 06:59 AM IST
IPL 2020 DC vs KXIP : సూపర్ ఓవర్ లో ఢిల్లీ క్యాపిటల్ గెలుపు

Updated On : September 21, 2020 / 10:16 AM IST

Rabada’s hero : IPL – 2020 13వ సీజన్ లో జరిగిన రెండో మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ లెవల్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్ విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ అభిమానులను అలరించింది. సూపర్ ఓవర్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ రెండు పరుగులు చేసింది. మూడు పరుగులు చేసిన ఢిల్లీ జట్టు సునాయసంగా గెలుపు సాధించింది.



తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. టార్గెట్ చేధించడానికి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు..రాహుల్ (21) అవుట్ అయిన తర్వాత..ఈ జట్టుకు అన్నీ కష్టాలే వచ్చాయి. తర్వాతి ఓవర్లో కరుణ్ నాయర్ (1), పూరన్ (0) ను అవుట్ చేసిన అశ్విన్ (2/2) పంజాబ్ జట్టును దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాక్స్ వెల్ రావడంతోనే అభిమానులు ఏదో ఊహించారు.



కానీ రబాడ వారి ఆశలపై నీళ్లు పోశాడు. అతడిని పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. అప్పటి వరకు మయాంక్ కు సహకారం అందించిన సర్ఫ్ రాజ్ (12) పెవిలియన్ చేరాడు. ఇక్కడే …గౌతమ్ (20), మయాంక్ లు ఆచితూచి ఆడడం ప్రారంభించారు. బౌండరీల మోత మోగించడంతో ఢిల్లీ శిబిరంలో ఆందోళన ప్రారంభమైంది.



మోహిత్ వేసిన 17 ఓవర్లో ఏకంగా రెండు సిక్స్ లు బాదాడు. 2 ఓవర్లలో 25 పరుగులు చేయాల్సి ఉంది. తర్వాత రబాడ వేసిన ఓవర్లలో రెండు ఫోర్లతో 12 రన్లు వచ్చాయి. అందరిలో ఉత్కంఠ. చివరి ఓవర్లో 13 రన్లు కావాల్సి ఉంది. 3 బంతుల్లో 12 పరుగులు సాధించింది పంజాబ్ జట్టు. అయితే..ఇక్కడే ట్విస్టు చోటు చేసుకుంది.

మూడు బంతుల్లో పంజాబ్ జట్టు ఒక్క పరుగు సాధించలేకపోయింది. రెండు వికెట్లు కూడ పడిపోయాయి. పంజాబ్ జట్టు కూడా 8 వికెట్లకు సరిగ్గా 157 పరుగులు చేసింది. మ్యాచ్ అనుహ్యంగా సూపర్ ఓవర్ కు దారి తీసింది.
మొదట పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. రబాడా బౌలింగ్ లో అనూహ్యంగా రెండే పరుగులు చేసింది.



అంతేగాకుండా..రెండు వికెట్లు కోల్పోయింది. మూడు పరుగుల టార్గెట్ ను ఢిల్లీ జట్టు 2 బంతుల్లోనే చేధించింది. అటు బ్యాట్, ఇటు బంతితో రాణంచిన స్టాయినిస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు పేలవంగా స్టార్ట్ చేసింది. షమీ (3/15) ధాటికి ఆ జట్టు 4 ఓవర్లు ముగిసే సరికి 13 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ధావన్ కనీసం ఖాతా తెరవలేదు. షా (5), హెట్ మెయర్ (7)లను షమీ అవుట్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులో ఉన్న పంత్ (31), శ్రేయస్ అయ్యర్ (39) జట్టును ఆదుకున్నారు. కోలుకున్నట్లే కనిపించినా..పంజాబ్ బౌలర్లు మళ్లీ షాకిచ్చారు.



పంత్ ను యువ స్పిన్నర్ రవి అవుట్ చేయగా, అయ్యర్ ను షమీ పెవిలీయన్ పంపించాడు. పటేల్ (6), అశ్విన్ (4) క్రీజులో నెలవలేదు. 18 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు సాధించింది. చివరి రెండు ఓవర్లలో స్టాయినిస్ చెలరేగి ఆడాడు. కాట్రెల్ వేసిన 19 ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టిన ఇతను..లాస్ట్ ఓవర్ లో బ్యాట్ ను ఝులిపించాడు.



రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. దీంతో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. చివరకు నో బాల్ కు రనౌట్ అయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 రన్లు సాధించింది.