IPL2021 : బెంగళూరు జట్టు 50 రన్లు, రాణిస్తున్న మాక్స్ వెల్

ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

IPL2021 : బెంగళూరు జట్టు 50 రన్లు, రాణిస్తున్న మాక్స్ వెల్

Ipl 2021

Updated On : April 18, 2021 / 4:12 PM IST

Royal Challengers Bangalore : ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆరంభంలోనే కెప్టెన్ కోహ్లీ (5) తీవ్ర నిరాశపరిచాడు. కోహ్లీ…రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి ఔటవగా…రజత్ పాటిదార్ (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు వికెట్లను వరుణ్ చక్రవర్తి తీశాడు. పడిక్కల్, మాక్స్ వెల్ లు రాణిస్తున్నారు. 19 బంతులను ఎదుర్కొన్న మాక్స్ వెల్ 30 పరుగులు చేయగా..17 బంతులను ఎదుర్కొన్న పడిక్కల్ 14 పరుగులు చేశాడు. ఏడు ఓవర్లు ముగిసే సరికి..జట్టు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.

తొలుత టాస్ నెగ్గిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచ్ ల్లో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ మూడో విజయంపై కన్నేసింది. కోల్ కతా నైడర్స్..బెంగళూరుపై విజయం సాధించి..రెండో విజయం నమోదు చేయాలని భావిస్తోంది. హర్బజన్ సింగ్ 2 ఓవర్లు వేసి..9 రన్లు ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి కేవలం ఒక్క ఓవర్ వేసి..మూడు పరుగులు ఇచ్చి..రెండు వికెట్లు తీశాడు.

Read More : IPL 2021 : కోహ్లీ అవుట్, బెంగళూరు బ్యాటింగ్