IPL 2021 MI Vs DC ముంబై వర్సెస్ ఢిల్లీ.. గెలుపెవరిది..?

ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ కేపిటల్స్ తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లో గెలుపెవరిది?

IPL 2021 MI Vs DC ముంబై వర్సెస్ ఢిల్లీ.. గెలుపెవరిది..?

Ipl 2021 Mi Vs Dc

Updated On : April 20, 2021 / 6:31 PM IST

IPL 2021 MI Vs DC : ఐపీఎల్ 2021 సీజన్ 14లో మరో ఇంట్రస్టింగ్ ఫైట్ జరగనుంది. ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ కేపిటల్స్ తలపడనుంది. మరి ఈ మ్యాచ్ లో గెలుపెవరిది?

గతేడాది(2020) సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చాంపియన్‌గా నిలిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ రన్నరప్‌గా నిలిచింది. లీగ్‌ దశలో ముంబై చేతిలో రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ క్వాలిఫయర్‌ 1లో ఓడింది. అయితే అనూహ్యంగా రెండో క్వాలిఫయర్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టిన ఢిల్లీకి మరోసారి ముంబైతో చేదు అనుభవమే ఎదురైంది. ఓవరాల్‌గా గత సీజన్‌లో ముంబైతో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓడిపోయింది. తాజాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ నేడు(ఏప్రిల్ 20,2021) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

”ఢిల్లీ క్యాపిటల్స​ మంచి టాలెంట్‌ ఉన్న జట్టు. గతేడాది సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు ఫైనల్లో మాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్‌ మంచి బౌలింగ్‌, బ్యాటింగ్‌తో సమతూకంగా ఉంది. కానీ నేడు జరిగే మ్యాచ్‌లో మళ్లీ మేమే పైచేయి సాధిస్తాం. వారు టాలెంట్‌ జట్టు కాబట్టే వారిని ఓడగొట్టాలంటే మంచి ప్లాన్‌తో బరిలోకి దిగాలి.

ఇప్పటికే చెన్నై పిచ్‌పై మాకు పూర్తి క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఢిల్లీ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఢిల్లీపై అటాకింగ్‌ గేమ్‌ ఆడితే వారు త్వరగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ కనబరుస్తున్నారు. చివరి 5 ఓవర్లలో బౌలర్లు మంచి ప్రదర్శన కారణంగా 20-25 పరుగులు మాత్రమే వస్తుండడం సానుకూలాంశం. కీలక సమయాల్లో మా బౌలర్లకు ఏం చేయాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంది” అని చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చెన్నై వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. మరోవైపు ముంబై ఇండియన్స్‌ మాత్రం చెన్నైలో తన చివరి మ్యాచ్‌ ఆడనుంది.