Siraj ahead of Bumrah : బుమ్రాను మించి సిరాజ్‌ దమ్మున్న పేసర్.. ఆకాశమే అతడి హద్దు..

టీమిండియా పేస్ బౌలింగ్ లో దమ్మున్న బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ఒకడు.. అయితే అతడ్ని మించిన మరో పేసర్ ఉన్నాడని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ బుమ్రా కంటే దమ్మున్న పేస్ బౌలర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు.

Siraj ahead of Bumrah : బుమ్రాను మించి సిరాజ్‌ దమ్మున్న పేసర్.. ఆకాశమే అతడి హద్దు..

Skill Wise, Siraj Even Ahead Of Bumrah

Updated On : April 24, 2021 / 7:27 PM IST

Siraj ahead of Bumrah : టీమిండియా పేస్ బౌలింగ్ లో దమ్మున్న బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ఒకడు.. అయితే అతడ్ని మించిన మరో పేసర్ ఉన్నాడని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా. హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ బుమ్రా కంటే దమ్మున్న పేస్ బౌలర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. స్లో బాల్స్ ఎలా? ఆఫ్ కటర్స్ ఏ విధంగా వేయాలి? యార్కర్లు ఎలా వేయాలి? లెంగ్త్ బాల్స్ ఏ సమయంలో వేయాలి.. ఇలా అన్నింట్లో బుమ్రాకు అతడే సాటి.

డెత్ ఓవర్ల బౌలింగ్ లో బుమ్రా దిట్ట.. ఇప్పుడు ఆ బుమ్రాకు మించి బంతులు విసరగల సామర్థ్యం మనోడిలోనూ ఉన్నాయని నెహ్రా సిరాజ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. వరల్డ్‌ క్రికెట్‌లో కంప్లీట్‌ ఫాస్ట్‌ బౌలర్‌గా బుమ్రా.. 50 టెస్టు వికెట్లను వేగంగా సాధించిన తొలి టీమిండియా బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అన్ని ఫార్మాట్లలో బుమ్రాకు సాటి లేదు. కానీ, బుమ్రా కంటే మహ్మద్‌ సిరాజ్‌.. ముందువరుసలో ఉంటాడని నెహ్రా అభిప్రాయపడుతున్నాడు.

గత మూడు నుంచి నాలుగేళ్లలో బౌలర్లలో కేవలం బుమ్రా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. స్కిల్స్‌ ప్రకారం.. బుమ్రా కంటే మహ్మద్‌ సిరాజ్‌ ఏం తక్కువ కాదంటున్నాడు. తన దృష్టిలో స్కిల్స్‌ విషయంలో బుమ్రా కంటే సిరాజే గొప్ప పేసర్‌ అనుకుంటున్నాని చెప్పుకొచ్చాడు. ఆకాశమే అతడి హద్దు.. అన్ని ఫార్మాట్లలో సత్తా చాటగల సామర్థ్యం సిరాజ్ ఉందంటున్నాడు. భారత్‌-ఎ జట్టుకు ఆడేటప్పుడు ప్రతీ మ్యాచ్‌లోనూ 5-6 వికెట్లు సాధించేవాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు బుమ్రా ఆడుతున్నాడు.. బెంగళూరు తరఫున సిరాజ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే.