TS Polycet 2020: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు పెంపు

Ts Polycet 2020 Entrance Exam Extended Till 9 June
TS Polycet ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పొడగించినట్లు ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యస్.సుధీర్‌కుమార్ తెలిపారు. జూన్ 9వరకు పొండగించారు. ఆలస్య రుసుముతో జూన్ 12వరకు పొడిగించినట్లు చెప్పారు. COVID-19 మహమ్మారి కారణంగా గత కొన్ని వారాలలో దరఖాస్తు గడువు చాలాసార్లు పొండగించాల్సి వచ్చింది.
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రెండేళ్ల అగ్రికల్చర్ డిప్లొమా, మూడేళ్ల అగ్రికల్చర్ డిప్లొమా ఇంజినీరింగ్ కోర్సులకు ఇక నుంచి పదో తరగతి మార్కులు లేదా గ్రేడ్లు కాకుండా పాలిసెట్ ర్యాంకును ప్రామాణికంగా తీసుకోనున్నారు.
2020-21 నాటికి ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటు రాష్ట్ర విద్యాసాంకేతిక, శిక్షణ మండలి (ఎస్‌బీటెట్) ఆధ్వర్యంలో నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్) ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది.