Covid in Mumbai : ముంబైలో 230 మంది డాక్టర్లకు కరోనా

ముంబైలో 230 మంది డాక్టర్లకు కరోనా బారినపడ్డారు. గత మూడు రోజుల్లోనే 230 మంది రెసిడెంట్‌ డాక్టర్లు కరోనా సోకిందని JJ హాస్పిటల్ చాప్టర్ అధ్యక్షుడు గణేష్ సోలుంకే తెలిపారు.

Covid in Mumbai : ముంబైలో 230 మంది డాక్టర్లకు కరోనా

230 Resident Doctors Tested Corona Positive In Mumbai (1)

Updated On : January 6, 2022 / 10:54 AM IST

230 resident doctors tested corona positive in mumbai : ముంబైలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ లో కూడా ముంబై భారీగా నమోదైన విషయం తెలిసిందే. ఈ థర్డ్ వేవ్ లో కూడా ముంబైలో కరోనా ఉదృతి తీవ్రంగా ఉంది. కరోనా వారియర్స్ గా పనిచేసే డాక్టర్లపై ఈ మహమ్మారి ప్రభావం చూపిస్తోంది. ముంబై మహానగరంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నక్రమంలో గత మూడు రోజుల్లోనే 230 మంది రెసిడెంట్‌ డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని JJ హాస్పిటల్ చాప్టర్ అధ్యక్షుడు గణేష్ సోలుంకే బుధవారం (బుధవారం 5,2022)తెలిపారు.

కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కెఇఎమ్) ఆసుపత్రిలో 60 మంది రెసిడెంట్ డాక్టర్లు, లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌లో 80 మంది, ఆర్‌ఎన్ కూపర్ ఆసుపత్రిలో మరో ఏడుగురు కూడా వైరల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడ్డారని గణేశ్‌ సోలంకి తెలిపారు.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 26,538 కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబైలోనే 15,166 కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 6,75,76,032కు చేరాయి. ఇందులో 87,505 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.