Bus Accident: ఏపీలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరణించిన వారిని ధనేశ్వర్ దళపతి (24), జీతూ హరిజన్ (5), సునెన్ హరిజన్ (2) దామోదర్ (45) మహి (4)గా గుర్తించారు.

Bus Accident: ఏపీలో బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి

Accident

Updated On : June 13, 2022 / 10:53 AM IST

Bus Accident: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ఘటన సోమవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరణించిన వారిని ధనేశ్వర్ దళపతి (24), జీతూ హరిజన్ (5), సునెన్ హరిజన్ (2) దామోదర్ (45) మహి (4)గా గుర్తించారు.

Boy Suicide: తల్లి పుట్టిన రోజున విష్ చేయనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

గాయాలపాలైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.