కరోనా వైరస్ మన శరీరాన్ని దాడి చేసే మార్గాలివే.. వైద్యుల హెచ్చరిక!

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. COVID-19 గుండె, మెదడు వంటి అవయవాలతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నిర్మూలన కోసం విస్తృత్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సరైన వ్యాక్సిన్ ఇప్పటికి కనిపెట్టలేదు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, హ్యుమన్ ట్రయల్ ప్రారంభం కాబోతున్నాయని అంటున్నారు. అయితే, ఇప్పుడు కరోనా వ్యాధి నివారణకు సాయపడే కొత్త సమాచారాన్నిపరిశోధనా విభాగం వెల్లడిస్తోంది. కరోనా వైరస్ మొట్టమొదటి కేసులు 2019 డిసెంబర్ చివరిలో ఉద్భవించినప్పటి నుండి ఆ తర్వాత 3 మిలియన్లకు పైగా ప్రజలకు వైరస్ సోకినట్లు నిర్ధారించింది. వందల వేల మంది ప్రాణాలను కరోనా బలి తీసుకుంది. ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది.
కరోనా వైరస్ మనుషులపై ఎలా దాడిచేస్తుంది? దాని లక్షణాలు, ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్కరిలో కరోనా లక్షణాలు ఒక్కొల్లా కనిపిస్తున్నాయి. రోజురోజుకీ కరోనా సోకిన వ్యక్తుల్లో కొత్త లక్షణాలు పుట్టకొస్తున్నాయి. లక్షణాలను బట్టి కరోనాను నిర్ధారించడం కూడా కష్టంగా మారుతోంది. చాలా మందికి వైరస్ తేలికపాటి అనారోగ్యానికి కారణమవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారొచ్చు. వ్యాధి ప్రభావాలు మరింత తీవ్రంగా ఉంటాయి. మరోవైపు ఒక మిలియన్ మందికి పైగా బాధితులు ఈ వ్యాధి బారి నుంచి కోలుకున్నారు కూడా. కానీ, COVID-19 ముప్పు తప్పదనే విషయం అందరూ గుర్తించుకోవాలి.
కరోనావైరస్ వివిధ జాతుల్లో సాధారణ లక్షణాలు కామన్‌గా ఉండొచ్చు. కానీ ప్రతి వ్యాధికారకం ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు COVID-19 ను అధ్యయనం చేస్తున్నారు. ఇది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారికి చికిత్స చేసే ప్రయత్నంలో భాగంగా తెలిసిన ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే, COVID-19 ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. న్యుమోనియా, sepsis లేదా ఊపిరితిత్తుల వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలను కలిగిస్తుంది. కానీ, ఇతర అవయాలపై కూడా దాడి చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని కొన్ని భాగాలు కూడా ప్రభావితమవుతాయని వైద్యులు భావిస్తున్నారు.
గుండెకు దెబ్బ :
కరోనా వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ సిటీలో తొలుత 400 మంది కంటే ఎక్కువగా కేసులతో ఆస్పత్రి పాలయ్యారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధి బారినపడ్డవారిలో దాదాపు ఐదింటిలో ఒక వంతు గుండె దెబ్బతిని అనారోగ్యం పాలయ్యారు. మరణానికి దారితీసేలా హై రిస్క్ ఎక్కువగా వీరిలోనే ఉంటుంది. వైరస్ కారణంగా ఎందుకు గుండె దెబ్బతింటుందో క్లారిటీ లేదు. journal Scienceలో రాసిన సైన్స్, మెరెడిత్ వాడ్మాన్ బృందం గుండె రక్త నాళాల పొరను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని లేదా ఊపిరితిత్తులలో గాయం వల్ల ఆక్సిజన్ లేకపోవడం అందక రక్త నాళాలు దెబ్బతినవచ్చని సూచిస్తున్నారు. ‘మానవజాతి ఇప్పటివరకు చూడని విధంగా వైరస్ విజృంభిస్తుందని వారు చెప్పారు.
రక్తం గడ్డకట్టడం :
ఈ వ్యాధి.. రక్త నాళాలను లక్ష్యంగా దాడి చేస్తుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. 14 అమెరికా రాష్ట్రాల్లో ధృవీకరించిన COVID-19 కేసులతో ఆస్పత్రిలో చేరిన రోగుల సర్వేలో సగానికి పైగా బ్లడ్ హైపర్ టెన్షన్ పరిస్థితులు ఉన్నాయని కనుగొన్నారు. Thrombosis Researchలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఇంటెన్సివ్ కేర్ పొందుతున్న ఆస్పత్రి రోగులలో అధిక సంఖ్యలో రక్తం గడ్డకట్టడం జరుగుతుందని కనుగొన్నారు. రక్తప్రవాహంలో గడ్డకట్టిన రక్తం మైగ్రేట్ కావొచ్చు, కొన్నిసార్లు మరణానికి దారితీయొచ్చు.
మెదడు, నాడీ వ్యవస్థ :
ఈ వ్యాధి మెదడును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కొన్ని అధ్యయనాలు నివేదిస్తున్నాయి. వుహాన్ అధ్యయనంలో కరోనావైరస్ ఉన్న 214 మంది ఆస్పత్రి రోగులలో మూడింట ఒక వంతు మంది వాసన, రుచి లేదా దృష్టిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. వైరస్ మెదడులోని నరాల చివరల్లో సోకుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మూర్ఛలు, స్ట్రోకులు, దెబ్బతిన్న కంటి దృష్టి, కండరాల గాయాలు వంటి నాడీ పరిస్థితులు తీవ్రమైన COVID-19 ఇన్ఫెక్షన్ ఉన్న రోగులలో ఎక్కువగా కనిపిస్తాయి.
జీర్ణవ్యవస్థ :
వైరస్ మానవ జీర్ణవ్యవస్థకు చేరుకోగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. medical journal Gastroenterologyలో ప్రచురించిన అధ్యయనం ఫలితాల్లో వెల్లడైంది. కరోనా వ్యాధితో ఆస్పత్రిలో చేరిన 73 మంది రోగులలో 39 మంది విసర్జించిన మలం శాంపిల్స్‌లో COVID-19 వైరస్ ఉన్నట్టు వెల్లడించాయి. లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌కు చెందిన Brennan Spiegel జీర్ణవ్యవస్థపై వ్యాధి ప్రభావాన్ని సూచిస్తూ ‘రోగులలో సగం మంది వరకు అధ్యయనాలలో సగటున 20శాతం మంది, డయేరియా అనుభవించారని సైన్స్ తెలిపింది.
COVID-19 శరీరాన్ని ప్రభావితం చేసే కొన్ని మార్గాల్లో వీటిని వివరించారు. కానీ, ఇవేకాదు.. మరికొన్ని ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. నియంత్రిత అధ్యయనాలతో వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించలేమని, భవిష్యత్ పరిశోధనలతో కరోనా ముప్పును ఎదుర్కోవటానికి మరిన్ని మార్గాలను గుర్తించగలమని ఆశిస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. (టీ కణాలు కథ ఏంటీ? కరోనా రోగుల్లో ఇవే కీలకమా?)