A poster featuring Tipu Sultan: టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను చించి పడేసిన యువకులు.. ఉద్రిక్తత.. వీడియో

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని హడ్సన్ సర్కిల్ లో కాంగ్రెస్ పార్టీ.. పలువురు స్వాతంత్ర్య సమయయోధుల పోస్టర్లను ఏర్పాటు చేసింది. వాటిలో టిప్పు సుల్తాన్‌కు చెందిన పోస్టర్ కూడా ఉంది. అయితే, దాన్ని కొందరు చించి పడేశారు. ఈ ఘటన గత రాత్రి చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో అశాంతి సృష్టించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

A poster featuring Tipu Sultan: టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను చించి పడేసిన యువకులు.. ఉద్రిక్తత.. వీడియో

A poster featuring Tipu Sultan

Updated On : August 14, 2022 / 3:27 PM IST

A poster featuring Tipu Sultan: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని హడ్సన్ సర్కిల్ లో కాంగ్రెస్ పార్టీ.. పలువురు స్వాతంత్ర్య సమయయోధుల పోస్టర్లను ఏర్పాటు చేసింది. వాటిలో టిప్పు సుల్తాన్‌కు చెందిన పోస్టర్ కూడా ఉంది. అయితే, దాన్ని కొందరు చించి పడేశారు. ఈ ఘటన గత రాత్రి చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివ కుమార్ మీడియాతో మాట్లాడుతూ… కర్ణాటకలో అశాంతి సృష్టించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ చేపట్టిన ఫ్రీడం మార్చ్ ను జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. కర్ణాటకలో వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. టిప్పు సుల్తాన్ అంశం ఆ రాష్ట్రంలో పదే పదే ఉద్రిక్తతలకు తావిస్తోంది. టిప్పు సుల్తాన్ ప్యాలెస్, విగ్రహాలు, బడుల్లో ఆయనకు సంబంధించి పాఠాలు వంటి అంశాలపై గతంలో తీవ్ర వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు మళ్ళీ టిప్పు సుల్తాన్ విషయంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడం గమనార్హం.

Sachin Tendulkar: సచిన్ తొలి సెంచరీకి నేటితో 32 ఏళ్లు.. గుర్తు చేసిన బీసీసీఐ