బిగ్‌బాస్ విన్నర్‌కు గిఫ్ట్ పంపిన రోహిత్ శర్మ

Abhijit Rohit Sharma: బిగ్ బాస్ తెలుగు నాలోగో సీజన్ విన్నర్ అభిజిత్‌కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నుంచి గిఫ్ట్ అందింది. నేరుగా హిట్ మ్యాన్ ఫోన్ చేసి మాట్లాడటమే కాకుండా.. తాను సంతకం చేసిన జెర్సీని కూడా గిఫ్ట్ గా పంపించాడు. ఈ విషయాన్ని అభిజిత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సీజన్ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న అభిజిత్.. ఈ పోస్టు పెడుతూ.. తన గురించి హిట్ మ్యాన్ కు చెప్పిన హనుమ విహారీ థ్యాంక్స్ చెబుతున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాలో విహారీ కూడా ఉన్నాడు. అక్కడ జరిగిన సంభాషణలో తెలుగు బిగ్ బాస్ షో గురించి టాపిక్ వచ్చిందట. సీజన్ గురించి మాట్లాడిన విహారీ విన్నర్ అభిజిత్ గురించి కాస్త చెప్పాడట. అంతేకాకుండా విన్నర్ అభిజిత్.. రోహిత్ శర్మకు చాలా పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పాడట. విజేతతో మాట్లాడాలనుకున్నాడో.. ఫ్యాన్ ను పలకరించాలనుకున్నాడో.. వెంటనే ఫోన్ కలిపాడు.
స్వయంగా మాట్లాడటమే కాకుండా తాను సంతకం చేసిన జెర్సీని కూడా గిఫ్ట్ గా పంపించాడు. తనకు కంగ్రాట్స్ చెప్పి.. గిఫ్ట్ కూడా పంపాడని అభిజిత్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతని నుంచి గిఫ్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని అభిజిత్ క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు.
రోహిత్ తల్లి పూర్ణిమా శర్మది విశాఖపట్నం.. పుట్టింది మహారాష్ట్రలోనే. అయినప్పటికీ అతనికి తెలుగు అర్థం అవుతుంది. అంతే కాదు గతంలోనూ డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్‌లో కూడా ఆడాడు.