Sonu Sood : గ్రామాలకు ఫ్రీజర్ బాక్సులను అందిస్తున్న ‘రియల్ హీరో’ సోనూ సూద్..
అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనూ సూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు..

Sonu Sood
Sonu Sood: కరోనా కష్ట కాలంలో ఎంతోమందికి సాయమందిస్తూ రియల్ హీరోగా, సహాయం పొందిన వారి పాలిట దేవుడిగా మారిన సోనూ సూద్ ఇప్పుడు మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను సోనూ సూద్ అందిస్తున్నారు.
ఇందులో భాగంగా సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర మరియు ఇతర గ్రామాల్లో ఈ మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనూ సూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఇన్నాళ్లు ఈ గ్రామాల వారు సమీప నగరం నుండి ఫ్రీజర్ బాక్స్ రావడానికి ఇబ్బందులు పడ్డారు. దీని వల్ల శవాలు కుళ్లిపోయి అయిన వారి చివరి చూపుకు దూరమయ్యేవారు. ఇది చాలా అసౌకర్యాలకు కారణమైంది. సహాయం కోసం సోను సూద్ ను సంప్రదించడంతో ఎంపిక చేసిన గ్రామాలకు వీలైనంత త్వరగా ఫ్రీజర్ బాక్సులను అందుబాటులో ఉంచుతామని సర్పంచులకు సోను సూద్ హామీ ఇచ్చారు..
.@Sonusood going to sponsor dead body freezer boxes in needy villages !!!#Sonusood pic.twitter.com/80zAcYoT2x
— BARaju’s Team (@baraju_SuperHit) May 31, 2021