Parth Pawar : మళ్లీ రాజకీయాల్లో అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కీలకపాత్ర

మహారాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పార్ధ్ పవార్ కీలక పాత్ర పోషించనున్నారా ? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, తిరుగుబాటు నేత కుమారుడు పార్థ్ పవార్ రాజకీయ తెరమీద ప్రత్యక్షమయ్యారు....

Parth Pawar : మళ్లీ రాజకీయాల్లో అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కీలకపాత్ర

Parth Pawa, Ajit Pawar

Updated On : July 7, 2023 / 3:37 PM IST

Maharashtra political crisis : మహారాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పార్ధ్ పవార్ కీలక పాత్ర పోషించనున్నారా ? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, తిరుగుబాటు నేత కుమారుడు పార్థ్ పవార్ రాజకీయ తెరమీద ప్రత్యక్షమయ్యారు. (Parth Pawar) మహారాష్ట్ర పవార్ కుటుంబంలో ఆధిపత్య పోరు (Maharashtra political crisis) మొదలైనప్పటి నుంచి అజిత్ పవార్ తనయుడు పార్థ్ పవార్ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. (Ajit Pawar’s next move)

Amarnath Yatra : కశ్మీర్ లోయలో భారీవర్షాలు..అమరనాథ్ యాత్రకు బ్రేక్

అజిత్ పవార్ చిన్న కుమారుడు పార్థ్ పవార్ 2019 లోక్‌సభ ఎన్నికలలో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అజిత్ పవార్ తిరుగుబాటు నేపథ్యంలో మళ్లీ అతని కుమారుడు పార్ధ్ పవార్ వచ్చే 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద అజిత్ పవార్ తిరుగుబాటు అనంతరం జరిగిన సమావేశంలో అతని కుమారుడు పార్థ్ పవార్ పాల్గొనడంతో అతని ప్రాధాన్యం ఏమిటో విదితమవుతుందని రాజకీయ పరిశీలకులు చెప్పారు.