కుస్తీ పోటీల్లో గెలవండి..గేదెను గిఫ్టుగా పొందండీ : నేషనల్ స్థాయిపోటీల్లో వినూత్న ప్రకటన

Agra : Buffalo Gift Women’s Rising Competition : క్రీడల్లో రాణించేవారికి ఎన్నో బహుమతులు అందుకుంటుంటారు. పతకాలు, షీల్డ్ లు అందుకుంటారు. కానీ గేదెను గిఫ్టుగా ఇవ్వటం గురించి బహుశా ఎక్కడా చూసి ఉండరు. కనీసం వినికూడా ఉండరు. కానీ ఆగ్రాలో జరుగుతున్న నేషనల్ ఉమెన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ క్రీడాకారిణికి గేదెను బహుమతిగా ఇస్తారట. అది పాలిచ్చే గేదె. దానికి వారే చెబుతున్నారో తెలిస్తే రీజన్ బాగానే ఉందిగానీ..మరీ గేదెను ఇస్తే దూరప్రాంతం వారైతే దాన్ని తీసుకెళ్లటానికి కూడా ఖర్చులు బాగానే అవుతాయి కదాంటున్నారు.
ఆగ్రాలో జరుగుతున్న నేషనల్ ఉమెన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణికి గేదెను బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్న నిర్వాహకులు. జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులు మెడల్‌తోపాటు బహుమతి మరింత భారీగా ఉండాలని నిర్వాహకులు అనుకున్నారో ఏమోగానీ వినూత్నంగా ఆలోచించారు.
ఆగ్రాలో జరుగుతున్న నేషనల్ ఉమెన్ రైజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఉత్తమ క్రీడాకారిణిగా రాణించినవారికి ప్రైజ్ మనీకి బదులు..చక్కగా పాలిచ్చే గేదెను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ పోటీల్లో గెలిచే ఉత్తమ రెజ్లర్ రూ.1.5 లక్షలు విలువ చేసే గేదెను ఇంటికి తీసుకెళ్లవచ్చని నిర్వాహకులు ప్రకటించారు. పాలిచ్చే గేదెను గిఫ్టుగా ఇవ్వడానికి వాళ్లే చెబుతున్నారంటే..పాలిచ్చే గేదె ద్వారా.. ఆ విజేతకు నిరంతరం ప్రోటీన్లు అందజేయడమే తమ ఉద్దేశమని చెబుతున్నారు.
అంటే.. ఆ క్రీడాకారుడు ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లను పాలను తాగి మరింత బలంగా తయారు కావచ్చని నిర్వాహకుల ఉద్ధేశ్యమన్నమాట. కాకపోతే..ఈ బహుమతిపై తుది నిర్ణయం తీసుకొనేందుకు కమిటీ ఏర్పాటు చేశామని ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ప్రసాద్ తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఈ ఆలోచనల వచ్చిందనీ..ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారని మహావీర్ ప్రసాద్ తెలిపారు.
ఒక వేళ ఉత్తమ రెజ్లర్‌కు గేదెను తీసుకోవటానికి ఇష్టపడకపోతే దానికి బదులుగా రూ.1.5 లక్షల క్యాష్ చెల్లిస్తామని తెలిపారు. క్రీడల్లో ఇటువంటి వినూత్నమైన గిఫ్టులు అందించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కశ్మీర్‌లోని కుప్వార్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా చేపను బహుమతిగా అందించిన విషయం తెలిసిందే..!!