Air India pilot : కాక్ పిట్‌లో గాళ్ ప్రెండ్‌ని కూర్చోబెట్టున్నాడు.. సిబ్బందిని ఫుడ్, మందు సెర్వ్ చేయమన్నాడు.. ఎయిర్ ఇండియా పైలట్ చివరికి..

ఎయిర్ ఇండియా పైలట్ నిబంధనలను అతిక్రమించాడు.. కాక్ పిట్‌లోకి గాళ్ ఫ్రెండ్‌ని అనుమతించాడు.. మందు, ఆహారం అందించమని సిబ్బందికి ఆర్డర్ వేసాడు.. ఆ తరువాత ఏమైందంటే?

Air India pilot : కాక్ పిట్‌లో గాళ్ ప్రెండ్‌ని కూర్చోబెట్టున్నాడు.. సిబ్బందిని ఫుడ్, మందు సెర్వ్ చేయమన్నాడు.. ఎయిర్ ఇండియా పైలట్ చివరికి..

Air India pilot

Updated On : April 21, 2023 / 3:22 PM IST

Air India pilot : ఎయిర్ ఇండియా పైలట్ నిబంధనలు అతిక్రమించాడు. కాక్‌పిట్‌లో (cockpit) తన గాళ్ ఫ్రెండ్ కూర్చునేందుకు అనుమతించాడు. కట్ చేస్తే విచారణ ఎదుర్కుంటున్నాడు.

Cobra Under Pilot Seat: పైలట్ సీటు కింద కింగ్‌కోబ్రా .. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ తరువాత షాక్ ఇచ్చిన కోబ్రా

విమానం యొక్క కాక్‌పిట్ లోనికి ప్రవేశించాలంటే కొన్ని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. విమానాన్ని నడుపుతున్న ఎయిర్‌లైన్ ఉద్యోగులు ముఖ్యంగా ఆఫ్-డ్యూటీ పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, మెయింటెనెన్స్ సిబ్బంది ..ఇతర అధికారులకు అనుమతి ఉంటుంది. విమాన కెప్టెన్ అనుమతితో మాత్రమే కాక్‌పిట్ లో వారికి అనుమతి ఉంటుంది. అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ద్వారా అనుమతి పొందిన అధికారులు లేదా వ్యక్తులకు కూడా అనుమతి ఉంటుంది. అయితే ఈ నిబంధనలకు నీళ్లొదిలేసి తన గాళ్ ఫ్రెండ్‌ని కాక్ పిట్‌లోకి ఆహ్వానించాడు ఎయిర్ ఇండియా పైలట్ (Air India pilot). ఫిబ్రవరి చివర్లో దుబాయ్ నుంచి ఢిల్లీకి (Dubai-Delhi flight) వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగింది.

iPhone14: రెండు ఐఫోన్14 ఫోన్లతో దొరికిపోయిన పైలట్.. ఎయిర్ ఇండియా ఏం చేసిందంటే..

మొదటగా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్న తన గాళ్ల ఫ్రెండ్‌కి బిజినెస్ క్లాస్‌లో సీటు ఉందేమో చూడమని విమాన కెప్టెన్ సిబ్బందిని కోరాడు పైలట్. బిజినెస్ క్లాస్ సీట్లు నిండిపోయాయని తెలిసిన తర్వాత తన గాళ్ ఫ్రెండ్‌ని కాక్ పిట్ లోకి రమ్మని ఆహ్వానించాడు. అంతే కాదు ఆమె ఫుడ్, ఆల్కహాల్ కూడా అందించాల్సిందిగా పైలట్ సిబ్బందిని కోరాడు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ లైన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.