Cobra Under Pilot Seat: పైలట్ సీటు కింద కింగ్‌కోబ్రా .. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ తరువాత షాక్ ఇచ్చిన కోబ్రా
విమానం గాల్లో ఎగురుతుండగా సీటు కింద అత్యంత విషపూరితమై కేబ్ కోబ్రాను చూసిన పైలట్ హడలిపోయాడు.. విమానం సురక్షితంగా ఎమర్జన్సీ ల్యాండ్ చేశారు. తరువాత ఆ కోబ్రామరోసారి షాక్ ఇచ్చింది. ఆ కోబ్రా ఏం చేసిందంటే..

Cape Cobra Under Pilot Seat
Cobra Under Pilot Seat : అది వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు బయలుదేరిన విమానం. గాల్లో ఎగురుతుండగా పైలట్ సీటు కింద ఏదో మెత్తగా తగులుతోంది ఏంటాని చూశాడు. అంతే అతని గుండె గుభేలుమనిపోయింది. చెమటలు పట్టేశాయి. సీటు కింద నుంచి అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా తల పైకెత్తింది. అంతే పైలెట్ గుండెలు దడదడలాడిపోయాయి. అంతే గాల్లో ఎగిరే విమానాన్ని అంత్యంత చాకచక్యంగా ల్యాండ్ చేసేశారు పైలెట్. విషపూరితమైన కేప్ కోబ్రా ఉందని తెలిసినా..ఈ విషయం బయటకు చెప్పకుండా సంయమనం పాటిస్తూ విమానాన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేసిన దక్షిణాఫ్రికా పైలట్ రుడాల్ఫ్ ఎరాస్మస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
సోమవారం (ఏప్రిల్ 3,2023) ఓ చిన్నపాటి విమానం వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు బయలుదేరింది. విమానంలో నలుగురు ప్రయాణీకులు, విమాన సిబ్బంది మాత్రమే ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ ఎరాస్‌మస్‌కు తన నడుము వద్ద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. పరిశీలించి చూడా నాగుపాము సీటు కింద దూరుతూ కనిపించింది. ఆ దృశ్యం చూడగానే పైలట్ ఎరాస్‌మస్‌కు దిమ్మతిరిగిపోయింది.
కాస్త ధైర్యం కూడదీసుకుని..సీటుకింద నాగుపాము ఉందనే విషయాన్ని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేశారు. తరువాత విమానాన్ని జోహాన్నెస్ బర్గ్‌లో ఎమర్జన్సీ ల్యాండ్ చేశారు. పైలట్ సంయమనంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. విమానం దిగేటప్పుడు సీటు పైకి ఎత్తి చూడగా నాగుపాము చుట్టుచుట్టుకుని పడుకుని కనిపించిందని..కానీ ఈ విషయాన్ని అందరికి చెబితే భయంతో గందరగోళం తలెత్తేదని తెలిపారి పైలట్. ఓపక్క విషపూరితమైన కోబ్రా..మరోపక్క తన ప్రాణంతో పాటు సిబ్బంది, ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాలి.. లేని ధైర్యం కూడదీసుకుని ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశామని తెలిపారు ఎరాస్‌మస్.
ప్రయాణానికి ముందు రోజే వార్సెస్టర్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపాము ఉండటాన్ని గుర్తించారు. దాన్ని పట్టుకుని అక్కడినుంచి తొలగించాలని యత్నించారు. కానీ పట్టుకునే ప్రయత్నంలో పాము ఇంజిన్ కవర్ల కింద దూరిపోయింది. ఇంజిన్ తెరిచి చూసినా పాము కనిపించకపోవటంతో అది అక్కడనుంచి బయటకు వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ అది బయటకు వెళ్లకుండా విమానంలోకి దూరిపోయి ఉంటుందని అస్సలు ఊహించలేదు. కానీ ఊహించని విధంగా పాము మరునాడే విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లో పైలెట్ సీటుకింద ప్రత్యక్ష్యంకావటంతో ఎట్టకేలకు విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేయటంతో పెను ప్రమాదం తప్పింది. అలా మొదటిసారి షాక్ ఇచ్చిన కోబ్రో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. విమానం గాల్లో ఉండగా పైలట్ కు కనిపించింది. దీంతో జాగ్రత్తగా పైలట్ ఎమర్జన్సీ ల్యాండ్ చేశారు. దాన్ని పట్టుకోవటానికి సిబ్బందిని రప్పించారు.
కేప్ కోబ్రా విమాన సిబ్బందికి మరోసారి ఝలక్ ఇచ్చి విమానం ల్యాండ్ అయ్యాక కూడా కనిపించకుండా తప్పించుకుంది. విమానం జోహాన్నెస్‌బర్గ్‌లో ల్యాండ్ చేశాక విమానం మొత్తాన్ని పరిశీలించినా అది కనిపించలేదు. సిబ్బంది మరోసారి దాన్ని పట్టుకోవటానికి యత్నించినా కనిపించలేదు. విమానాన్ని పార్టులుగా ఊడదీసి చూసినా అది కనిపించలేదు. అలా రాత్రి వరకు సిబ్బంది కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ క్షుణ్ణంగా వెదికారు.అయినా కనిపించకపోవటంతో దాన్ని బయటకు రప్పించటానికి విమానం చుట్టూరా ఆహారాన్ని పెట్టారు. పాము బయటకు వస్తుందని ఎదురు చూశారు. కానీ రాత్రి అయినా పాము జాడలేదు. ఇక పాముని వెతికేపనికి బ్రేక్ ఇచ్చారు. పామును బయటకు రప్పించేందుకు మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ ఆహారాన్ని పాము తాకిన దాఖలాలు కనిపించలేదు. దీంతో.. పాము విమానం నుంచి బయటపడి వెళ్లిపోయి ఉంటుందని వారు భావిస్తున్నారు.
ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదని విమాన రంగ నిపుణులు సైతం చెబుతున్నారు. పైలట్ సంయమనంతో వ్యవహరించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పిందని..అతను ఏమాత్రం కంగారు పడి ఉన్నా విమానం అదుపు తప్పి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని కానీ అటువంటి ప్రమాదం జరగకపోవటం సంతోషించే విషమే అయినా..పాము మాత్రం కనిపించకపోవటం ఆందోళనగా ఉందన్నారు. కానీ పాముని పట్టుకోవటానికి సిబ్బంది వచ్చే సమయంలోనే అది మెల్లగా విమానం నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయి ఉంటుందని పైలట్ రుడాల్ఫ్ ఎరాస్మస్ భావిస్తున్నారు.